ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్ర వర్శిటీ వెబ్‌సైట్ హ్యాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 30: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ శనివారం ఉదయం హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఎయు సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించే సౌకర్యాన్ని శనివారం ప్రారంభించిన నేపథ్యంలో ఇది జరగడం గమనార్హం. ఉదయం 7 గంటల ప్రాంతంలో ‘ఆంధ్రాయూనివర్సిటీ.ఎడ్యు. ఇన్’ వెబ్‌సైట్ తెరచిన కొంతమందికి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో దానిని సరిచేశారు. ఇప్పటివరకూ మూడు సార్లు వర్సిటీ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. ఇది ఇంటి దొంగల పనే అన్న ప్రచారం కూడా వర్సిటీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కాగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండు వెబ్‌సైట్లు, ఎయు ఇంజనీరింగ్ కళాశాలకు ఒక వెబ్‌సైట్ ఉన్నాయి.