గుంటూరు

వైభవంగా సప్తమ సూర్యయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జూలై 31: ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు కలగకుండా నవ్యాంధ్ర రాజధాని, అమరావతి శీఘ్రగతిన అనేక రంగాల్లో పురోభివృద్ధి, ప్రగతిని సాధించాలనే ప్రధాన సంకల్పంచేసి ఏడు గంటల పాటు నగరంలోని బృందావన గార్డెన్స్ ధార్మిక విజ్ఞాన ప్రాంగణంలో సప్తమ సూర్య మహాయాగాన్ని వైభవంగా నిర్వహించారు. రాష్ట్రం, దేశం, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యంగా సంభవిస్తున్న పరిణామాలు, వీటన్నింటికీ తోడు అలజడులు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుని వేలాదిమంది అమాయక ప్రజలు మృత్యువాత పడటం పట్ల వీటి నివారణకు విశేషమైన ఫలితాలనిచ్చే సప్తమ సూర్యయాగాన్ని సంకల్పించి ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్య సిద్ధాంతి శ్రీనివాసగార్గేయ తమబృందంతో ఆదివారం రోజంతా నిర్వహించారు. ఆషాడమాసం ముగింపునకు చేరుకుని శ్రావణమాసం ప్రవేశిస్తున్న శుభవేళ ఆరుద్రానక్షత్రంతో కూడివున్న కారణాన ఈ యాగాన్ని ఆదివారం నాడే నిర్వహించాలని దైవ సంకల్పమైందని, అందునా శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత యజ్ఞకుండాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభాతవేళ వివిధ దేవతలకు ప్రత్యేక అర్చనలు గావించిన రుత్విక్, వేద పండితులు ప్రధాన హోమగుండానికి శాస్త్రోక్తంగా పూజలు గావించి సూర్యభగవానునికి అభిముఖంగా నిలుచుని ప్రణామాలర్పించారు. అగ్నిదేవునికి ఆవాహన కూడా చేశారు. 21 ద్రవ్యాలను హోమగుండంలో సమర్పించి స్వస్తివాక్యాలను పలికారు. ఈ యాగం వలన సమస్త గ్రహబాధలు, దోషాలు నివృత్తి అవుతాయని గార్గేయ అధిక సంఖ్యలో తలరివచ్చిన భక్తులనుద్దేశించి వివరించారు. యాగాన్ని పురస్కరించుకుని ధార్మిక విజ్ఞాన ప్రాంగణం వేదికపై శివపార్వతులను, ఇతర దేవతలను చూడచక్కనైన రీతిలో ఏర్పాటుచేసి సుందరంగా అలంకరించారు.
సరిగ్గా సాయంకాలం ప్రదోషకాల సమయంలో యాగానికి వేదోప్తంగా పూర్ణాహుతి గావించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ బొల్లేపల్లి సత్యనారాయణ, భాష్యం విద్యాసంస్థల ప్రతినిధి కిషోర్, డాక్టర్ జయప్రకాష్, ఉభయ రాష్ట్రాల నుంచి విచ్చేసిన అనేక మంది ప్రముఖులు గార్గేయ ఫౌండేషన్ సభ్యులు పూర్ణాహుతి ప్రసాదాన్ని స్వీకరించారు.