గుంటూరు

సాగర్ ఆధునికీకరణ పనులకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 30: నాగార్జునసాగర్ కుడికాల్వ ఆధునికీకరణ పనులకు మరోసారి బ్రేక్ పడింది. ప్రభుత్వం మంచినీటి అవసరాలకు నీటిని విడుదల చేయటంతో పాటు కృష్ణా పుష్కరాలపనుల్లో అధికారులు బిజీ కావడంతో ఆధునికీకరణ అటకెక్కింది. దశాబ్ద కాలంగా ప్యాకేజీలకే కుడికాలువ పనులు పరిమితమవుతున్నాయి.. ప్రపంచ బ్యాంక్, ప్రభుత్వ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ పనులు చేపట్టేందుకు దీర్ఘకాలిక ప్రాతిపదికన టెండర్లు పిలిచారు. నిర్దేశించిన గడువు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ ప్రాథమిక స్థాయిలో పురోగతి ఆశాజనకంగాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భాగస్వామ్యంతో పనులను చేపట్టారు. అయితే విభజన అనంతరం తెలంగాణ గ్రామాలకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు రూ. 40 కోట్ల చెల్లింపులు జరిపింది. ఇంకా రైతుల బకాయిలు తీర్చాల్సి ఉంది. సాగర్ ఆధునీకరణకు ప్రపంచ బ్యాంకు ప్రభుత్వ వాటాగా 2008లో రూ. 2832.7 కోట్లు మంజూరు చేసింది. సుమారు 30 ప్యాకేజీలుగా వర్గీకరించి కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. గుంటూరు జిల్లా పరిధిలో ప్రధాన కాలువ, బ్రాంచి కాలువ ఆధునికీకరణకు రూ. 374 కోట్లు కేటాయించారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, సాగునీటి వినియోగదారుల సంఘాల పరిధిలో కాలువల ఆధునికీకరణకు రూ. 610 కోట్లు మంజూరయ్యాయి. కుడి ప్రధాన కాలువతో పాటు బ్రాంచి కెనాల్ పనుల్లో మితిమీరిన జాప్యం జరుగుతోంది. ఇందులో కేవలం 8,9 ప్యాకేజీ పనులు మాత్రమే పూర్తయ్యాయి. బెల్లంకొండ, జూలకల్లు, గుంటూరు, అద్దంకి బ్రాంచి కెనాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు రూ. 246.18 కోట్లు, సాగునీటి సంఘాలకు సంబంధించిన ప్యాకేజీలు రూ. 233.75 కోట్లు ఖర్చు పెట్టారు. వీటితో పాటు పుష్కరాలకు సంబంధించి మరో రూ. 60కోట్ల మేర పనులకు టెండర్ పెట్టారు. కుడి ప్రధాన కాలువకు సంబంధించి ఐదు పనులకు గాను రెండు, బ్రాంచి కెనాల్ పరిధిలో మూడు పనులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు చేపట్టిన 28, సాగునీటి సంఘాలు చేపట్టిన 73 పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఏటా పెరుగుతున్న అంచనాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. 2010లో సంభవించిన వరదలు అప్పట్లో సాగర్ మనుగడకే సవాల్ విసిరాయి. ఈ సందర్భంలో ఆధునికీకరణ పనులపై పర్యవేక్షణా లోపం కారణంగా ప్రమాణాలకు పాతర వేస్తున్నట్లు తెలియవచ్చింది. కొన్నిచోట్ల పనులు జరక్కుండానే బిల్లులు రూపొందిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సమగ్రంగా సాగర్ ప్యాకేజీలపై క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలన జరపాల్సిన అవసరం ఉందనేది స్పష్టమవుతోంది.