విజయనగరం

కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో అధికార పార్టీకి తిప్పలు తప్పవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 31: పాలనా సౌలభ్యంలో భాగంగా జిల్లాలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ రెవెన్యూ డివిజన్ పరిధి, పోలీసు డివిజన్ పరిధి ఒకేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాలో ఏర్పడే కొత్త రెవెన్యూ డివిజన్ ఎక్కడనేది అధికార పార్టీ నాయకులకు అంతుపట్టని విధంగా మారింది. ప్రస్తుతం పోలీసు సబ్ డివిజన్ కేంద్రంగా ఉన్న బొబ్బిలి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారా, లేక గతంలో ప్రతిపాదించిన విధంగా చీపురుపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందా అనేది రాజకీయంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడే పరిస్థితి నెలకొంది.
జిల్లాలో ప్రస్తుతం విజయనగరం, పార్వతీపురం డివిజన్ కేంద్రాలుగా రెవెన్యూ పాలన కొనసాగుతోంది. కానీ పోలీసుశాఖ పరంగా విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి సబ్ డివిజన్లు కొనసాగుతున్నాయి. జిల్లాలోని క్రైమ్‌రేటు ఆధారంగా బొబ్బిలి కేంద్రంగా పోలీసు సబ్ డివిజన్ ఏర్పాటు చేసారు. పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాలతోపాటు విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని గజపతినగరం నియోజకవర్గానికి చెందిన పోలీసు స్టేషన్లను బొబ్బిలి పోలీసు సబ్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో, ఆ తరువాత కాంగ్రెస్ హయాంలో చీపురుపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది. రాష్టవ్య్రాప్తంగా కొత్త మండలాలు, కొత్త డివిజన్ల ఏర్పాటు సందర్భంగా చీపురుపల్లి డివిజన్ ఏర్పాటు అవుతుందని బావించారు. కానీ ఇతర కొన్ని జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరిగినా చీపురుపల్లిలో డివిజన్ ఏర్పాటు పెండింగులో పడిపోయింది.
తాజాగా పాలనా సంస్కరణలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నిర్ణయించటం, అందులో ఒకటి విజయనగరం జిల్లాలో ఏర్పాటుకు ప్రతిపాదించటం జిల్లా ప్రజలకు సంతృప్తి కలిగించే వ్యవహారమే. ఇదే సమయంలో రెవెన్యూ డివిజన్, పోలీసు సబ్ డివిజన్ పరిధి ఒకేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాలో కొత్తగా ఏర్పడే రెవెన్యూ డివిజన్ ఎక్కడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం పోలీసు సబ్ డివిజన్ కొనసాగుతున్న బొబ్బిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారా, లేక గతంలో వచ్చిన డిమాండ్ మేరకు చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్ చేస్తారా అనేది ఎవరికీ అంతుపట్టని పరిస్థితి. బొబ్బిలిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తే పాలనాపరంగా పెద్దగా సమస్యలు ఏమీ ఉండవని చెప్పవచ్చు. కానీ రాజకీయ ఒత్తిడితో చీపురుపల్లి కేంద్రంగా రెవెన్యూ ఏర్పాటుచేస్తే బొబ్బిలికి బదులు చీపురుపల్లి కేంద్రంగా పోలీసు సబ్ డివిజన్ పనిచేయవలసి వస్తుంది. బొబ్బిలి ప్రాంత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే పోలీసు సబ్ డివిజన్ తప్పనిసరి కొనసాగించివలసిన పరిస్థితులు ఉన్నాయి. దీనికితోడు పాలనాపరంగా కూడా బొబ్బిలి అందరికీ అనుకూలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా చీపురుపల్లిలో కొత్తగా మరో పోలీసు సబ్ డివిజన్ ఏర్పాటు తప్పనిసరి. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని అధికారవర్గాల అభిప్రాయం. మండలాల పరిధి మార్పులు, చేర్పులతో బొబ్బిలి కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు బావిస్తున్నాయి.