బిజినెస్

ఉత్పత్తిలో సింగరేణి వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఆగస్టు 1: గడచిన నాలుగు మాసాల బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి సంస్థ వెనుకబడింది. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం 2 కోట్ల 28 లక్షల 5,800 టన్నులవగా, కోటీ 79 లక్షల 40,365 టన్నులు మాత్రమే సాధించి 88 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది. మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో కొత్తగూడెం, శ్రీరాంపూర్ మాత్రమే ఉత్పత్తి లక్ష్యాలను సాధించాయి. కొత్తగూడెం ప్రథమ స్థానంలో, శ్రీరాంపూర్ ఏరియా ద్వితీయ స్థానంలో నిలిచాయి. కొత్తగూడెం 26 లక్షల 21,300 టన్నులకుగాను 26 లక్షల 64,935 టన్నులు సాధించి 102 శాతం, శ్రీరాంపూర్ 15 లక్షల 28,800 టన్నులకుగాను 15 లక్షల 45,594 టన్నులు సాధించి 101 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకున్నాయి. మిగతా ఏరియాల్లో రామగుండం-3 98 శాతం, భూపాలపల్లి 92 శాతం, బెల్లంపల్లి 89 శాతం, మణుగూరు 87 శాతం, రామగుండం-1 87 శాతం, రామగుండం-2 85 శాతం, ఇల్లెందు 85 శాతం, ఆడ్రియాల ప్రాజెక్టు 66 శాతం, మందమర్రి అత్యల్పంగా 59 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకున్నాయి. నాలుగు మాసాల్లో భూగర్భ గనుల్లో 75 శాతం ఉత్పాదక రేటు, ఓపెన్‌కాస్టు గనుల్లో 92 శాతం ఉత్పాదక రేటు నమోదైంది. ఎండలు, వర్షాలు ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణాలయ్యాయ.