రాష్ట్రీయం

పోలవరం కుడికాల్వకు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఆగస్టు 1: కృష్ణానది వైపుకి గోదావరి జలాలు గలగలాపారిస్తున్న పోలవరం కుడికాల్వకు సోమవారం తెల్లవారుఝామున గండిపడింది. కృష్ణాజిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామ సమీపంలోని 122.100 కిలోమీటరు వద్ద రామిలేరు అండర్ టనె్నల్ పక్కనే గండి పడటంతో నీరంతా వృథాగా కొల్లేరులోకి పోతోంది. గత 25రోజుల నుండి గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడికాల్వ నుండి కృష్ణానదిలోకి మళ్లిస్తూ ప్రభుత్వం కృష్ణాడెల్టా రైతులకు సాగునీరు అందిస్తోంది. గండి పడిన విషయం తెలుసుకున్న జలవనరుల శాఖ అధికారులు పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా గోదావరి జలాల తరలింపును నిలిపివేశారు. గండి పూడ్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గండిపడిన ప్రాంతాన్ని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం ఉదయం పరిశీలించారు. గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా మంత్రి ఉమ విలేఖరులతో మాట్లాడుతూ గత నెల 6న పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జలాలను పంపుల ద్వారా కృష్ణానదికి తరలించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. నాటి నుండి నేటివరకు నీరు ఈ కాల్వ ద్వారా ఉద్ధృతంగా ప్రవహిస్తోందన్నారు. పల్లెర్లమూడి గ్రామం వద్ద యుటికి సమీపంలో గండి పడిందని, దీని పూడ్చివేత పనులు ముమ్మరం చేశామని చెప్పారు. ఇప్పటివరకు 6 టిఎంసిల గోదావరి జలాలను కృష్ణాకు తరలించామన్నారు. గండి పడిన ప్రదేశంలో కాల్వగట్లు గతంలో నిర్మించినవేనని, ఇటీవలి కాలంలో వేసినవి కాదని వివరించారు. గండి విషయంలో పలు అనుమానాలు ఉన్నందున పోలీసు శాఖతో విచారణ జరిపించాలని మంత్రి ఉమ ఆదేశించారు. గండి పడిన ప్రాంత కాల్వ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించామన్నారు. పనులు పూర్తయ్యేవరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. గండి వల్ల సమీపంలోని వ్యవసాయ భూములకు ఎలాంటి నష్టం లేదని, రామిలేరు ద్వారా కొల్లేరులోకి నీరు వెళతాయని చెప్పారు. కాల్వలో నీటి పరఫరా, పర్యవేక్షణకు మూడు షిఫ్టులుగా ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గండి పూడ్చివేత అనంతరం కాల్వలో గోదావరి జలాలు యథావిధిగా ప్రవహిస్తాయని మంత్రి ఉమ వివరించారు.
ఇదిలావుండగా పోలవరం కుడికాల్వకు గండి పడటానికి కారణాలను వెంటనే తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కాలువ గట్టుకు గండి కొట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటివి తలెత్తకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

చిత్రాలు..పోలవరం కుడికాల్వకు గండి పడిన దృశ్యం, పరిశీలిస్తున్న మంత్రి దేవినేని ఉమ