రాష్ట్రీయం

విశాఖలో ఎఎంటిజెడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: ఆసియాలోనే అత్యంత అధునాతన వైద్య పరికరాల తయారీ, పరీక్షా కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ (ఎఎంటిజెడ్) పేరుతో ఏర్పాటవుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు ఈ నెల 19న శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అదేరోజు అంతర్జాతీయంగా పేరొందిన వైద్య సాంకేతిక పరికరాల తయారీదారులతో విశాఖలో శిఖరాగ్ర సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఆ శాఖకు చెందిన అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం ఇక్కడ సమావేశమై జోన్‌కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. హాపెనింగ్ సిటీగా మారిన విశాఖ ఇప్పటికే ఫార్మా రంగానికి చిరునామాగా మారిందని ఆయనన్నారు. జోన్ ఏర్పాటుతో నగర ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరుగుతుందన్నారు. ఎలక్ట్రానిక్ వైద్య పరికరాల తయారీ రంగంలో ఎగుమతులకు వీలుకల్పించే మూడు ప్రధాన ఓడరేవులు విశాఖ సమీపంలోనే ఉండటం ప్రధాన ఆకర్షణ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఎఎంటిజెడ్‌ను వరల్డ్ బెస్ట్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ పార్క్‌గా తీర్చిదిద్దాలని అధికారులను ఆయన ఆదేశించారు. వైద్య పరికరాల తయారీలో మనదేశం అత్యంత వెనుకబడి ఉందని, మరీ ముఖ్యంగా పరిశోధనా యూనిట్ల కోసం ఇప్పటివరకూ మనం విదేశాలపై ఆధారపడుతున్నామని అన్నారు. ఎఎంటిజెడ్ ఏర్పాటుతో ఈ లోటు తీరుతుందన్నారు. చైనా పర్యటనలో అక్కడ ఈ తరహా పార్క్‌ను చూశానని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో ప్రస్తుతానికి అదే అతిపెద్ద వైద్య సాంకేతిక పరికరాల తయారీ కేంద్రంగా ఉందని తెలిపారు. వైద్య సాంకేతిక పరికరాల ఎగుమతులను పెంచడం, ఈ రంగంలో భారీగా ఉద్యోగ, ఉపాధి కల్పన, మరింత చౌకగా వైద్యసేవలు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా కేంద్రం సహకారంతో ఈ జోన్ స్థాపనను తలపెట్టామని వివరించారు.
విశాఖ జిల్లా నడుపూరులో తొలుత 270 ఎకరాల్లో జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కామినేని శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. 200కు పైగా కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య తెలిపారు. కాంపొనెంట్ టెస్టింగ్ సెంటర్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇంటర్‌ఫెయిరెన్స్ ల్యాబొరెటరీ, కేబినెట్ వౌల్డింగ్, ఇంజక్షన్ వౌల్డింగ్ సెంటర్, మెడికల్ గ్రెడ్ ఉత్పత్తుల 3డి డిజైనింగ్, ప్రింటింగ్ సదుపాయాలు వంటి అనేక యూనిట్లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయని ఎఎంటిజెడ్ సిఇఓ డాక్టర్ జితేంద్ర శర్మ తెలిపారు.
ఎఎంటిజెడ్‌లో నిర్మించనున్న 12 భవంతులను పనె్నండు విభిన్న ఆకృతులతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఈసందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. శాస్తవ్రేత్తలు, పరిశోధకులు అక్కడే నివాసం ఉండేలా 50 ఎకరాల్లో గృహ సముదాయాలు నిర్మించాలని కూడా సూచించారు. ఎఎంటిజెడ్ కొత్త పాలక సభ్యులను సిఇఓ ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఈసందర్భంగా దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను చంద్రబాబు ప్రారంభించారు.

చిత్రం.. విజయవాడ సమీక్షలో చంద్రబాబు