రాష్ట్రీయం

20 అంశాల పుర‘పాలన’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 1: పురపాలికల్లో ప్రధానంగా 20 అంశాలను తీసుకుని ముందుకెళ్లేందుకు నిర్ణయించామని, వచ్చే జూన్ 2నాటికి కనీసం అందులో మూడోవంతైనా సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టు రాష్ట్ర ఐటి, పురపాలక మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. సోమవారం కరీంనగర్‌లో తొలిసారి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అధికారులతో రాష్టస్థ్రాయి సమావేశం నిర్వహించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీలు స్వయంసమృద్ది సాధనతోపాటు, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలన్నారు. పారిశుద్ద్య సేవలు, తాగునీటి సరఫరా, ఆర్థిక ప్రగతి అంశాలపై దృష్టి సారించినప్పుడే, మున్సిపాల్టీలు అభివృద్ధి సాధిస్తాయన్నారు. మున్సిపాల్టీల అభివృద్దికి అవసరమైతే చట్టాలను మార్చడానికి వెనుకాడేది లేదన్నారు. ఈ విషయంలో సిఎం కెసిఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మహిళల కోసం అన్ని మున్సిపాల్టీల చౌరస్తాలు, ప్రధాన కూడళ్లలో ‘షీ’ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాలనుబట్టి మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని, వచ్చే గాంధీ జయంతికి పూర్తి చేస్తామన్నారు. అలాగే పాఠశాలలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్దా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా పట్టణ ప్రజలకు మంచినీరు అందిస్తామని, కరీంనగర్‌లో ప్రవేశపెట్టిన రూ.1కే నల్లా కనెక్షన్ పద్ధతిని రాష్టమ్రంతటా అమలు చేస్తామన్నారు. వచ్చే జూన్ 2నాటికి అక్రమ నల్లా కనెక్షన్లు క్రమబద్ధీకరిస్తామని, సింగిల్ విండో విధానంలో కనెక్షన్లు ఇస్తామన్నారు. మున్సిపాల్టీల్లో మొబైల్ యాప్‌లు ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. అలాగే మున్సిపాలిటీల్లో సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్ విధానం తెస్తామన్నారు. 15 ఏళ్లు పైబడిన మున్సిపల్ వాహనాలను దశలవారీగా మార్చి, కొత్త వాహనాలు సమకూరుస్తామన్నారు. మున్సిపల్టీల్లో విలువైన ప్రభుత్వ భూములను గుర్తించి, చుట్టూ మొక్కలతో ఫెన్సింగ్ వేస్తామన్నారు. తొలుత సమావేశంలో పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, హరితహారం, మిషన్ భగీరథ, మంచి నీటి సరఫరా, ఎల్‌ఇడి బల్బుల వినియోగం, మహిళా సంఘాలు, డబుల్ బెడ్‌రూం వంటి అంశాలతోపాటు మున్సిపాలిటీల ఆర్థికాంశాలు, ప్రజలకు అందిస్తున్న వౌలిక సదుపాయాలపై మంత్రి కెటిఆర్ సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంజి గోపాల్, మున్సిపల్ పరిపాలన కమిషనర్ దానకిషోర్, రాష్ట్రంలోని మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూన్న మంత్రి కెటిఆర్