రాష్ట్రీయం

రిజర్వాయర్లకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: గోదావరి, కృష్ణా నదులపై ఉన్న జలాశయాలు మెల్లమెల్లగా నీటితో నిండుతున్నాయి. నీళ్లు పూర్తిగా అడుగంటిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి గత నెలరోజుల్లో దాదాపు 36 టిఎంసిల నీరు చేరడంతో నీటినిలు 40 టిఎంసిలకు చేరింది. ఈ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 42 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో కేవలం ఏడు టిఎంసిల నీరు మాత్రమే ఉంది. కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో పూర్తిగా జలకళ ఉట్టిపడుతోంది. అయితే గోదావరి ఉపనదుల్లో ఒకటైన మంజీరా నదిలోకి ఇప్పుడిప్పుడే నీటిప్రవాహం వస్తోంది. తాజా సమాచారం ప్రకారం 30 టిఎంసిల సామర్థ్యం ఉన్న సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 3.43 టిఎంసిల నీరు ఉంది. ప్రాజెక్టులోకి మంజీరాద్వారా 6300 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కర్నాటకలోని ఆల్‌మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండిపోవడంతో వీటి కింద సాగుకోసం నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే అదనపునీటిని కృష్ణానదిలోకి వదులుతుండటంతో ఈ నీరు జూరాలకు చేరుతోంది. ప్రస్తుతం జూరాలలోకి 28 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 39 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రం ఎగువ జూరాల నుంచి 48 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటిమట్టం 823.50 అడుగులుగా నమోదైంది. 43.55 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 14,126 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో జలాశయం నీటిమట్టం 854 అడుగులకు చేరుతుందని, వెంటనే పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా ద్వారా రాయలసీమకు సాగునీరు విడుదల చేసే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

చిత్రం.. నీటితో కళకళలాడుతున్న వికారాబాద్‌లోని కాట్‌పల్లి ప్రాజెక్టు