ఆంధ్రప్రదేశ్‌

‘ప్రాణదానం’ పథకానికి ప్రాచుర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: తిరుమలలో అన్నదానం కార్యక్రమానికి టిటిడి ఎంత ప్రాచుర్యం కల్పించిందో ప్రాణదానం పథకాన్ని అదేస్థాయిలో భక్తుల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాణదానం పథకానికి ప్రచారం కల్పిస్తే పెద్దఎత్తున దాతలు ముందుకొస్తారని అన్నారు. తద్వారా మరింత మంది పేదలకు వైద్యం అందించవచ్చని సూచించారు. వచ్చే రెండేళ్లలో శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ అభివృద్ధి, ఫ్యాకల్టీ నియామకం, తదితర అంశాలపై ఓ కన్సల్టెంట్‌ను నియమించుకుని వారి సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ 16వ సమావేశం సోమవారం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్విమ్స్‌ను దేశంలోనే అత్యున్నత వైద్యసేవా సంస్థగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ప్రఖ్యాత వైద్య సంస్థలతో ఎంఓయులు కుదుర్చుకోవాలని, పిపిపి పద్ధతిలో భాగస్వాములను చేసుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చని చంద్రబాబు చెప్పారు. స్విమ్స్, శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమన్, రుయా, బర్డ్ ఆసుపత్రులన్నీ టిటిడి సారథ్యంలో పనిచేయాలని, వీటన్నింటినీ అనుసంధానిస్తూ సమన్వయపరచాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. రాయలసీమ జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉన్న స్విమ్స్ క్యాన్సర్, కార్డియాక్, ట్రామాకేర్ సంబంధిత వైద్యసేవలు అందించేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, పాన్ అమెరికన్ ట్రామా సొసైటీ, వర్జీనియా కామన్‌వెల్త్ హెల్త్ సొసైటీలు స్విమ్స్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్టెమ్‌సెల్ థెరపీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలకు సంబంధించి రోడ్‌మ్యాప్‌ను కూడా అధికారులు సిఎంకు వివరించారు. మెరుగైన వైద్యవిద్య కోసం 20 మంది ప్రొఫెసర్లు, 29 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 69 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సిఎం అంగీకరించారు.

చిత్రం.. స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు