కృష్ణ

మోదుమూడిలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఆగస్టు 1: మండల పరిధిలోని మోదుమూడి గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో తుంగల ధనలక్ష్మి, పులగం అనసూయలకు చెందిన పూరిళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. గ్యాస్ సిలెండర్ పేలటంతో ఈ ప్రమాదం జరిగింది. అవనిగడ్డ అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. రూ.2.30లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి రాజా బాధితులను పరామర్శించి నగదు సాయం అందజేశారు. రెవెన్యూ అధికారులు నిత్యావసర వస్తువులు, రూ.5వేలు ఆర్థిక సాయం అందచేశారు. జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, బచ్చు శ్రీనివాసరావు, రఘునాధ్ బాధితులను పరామర్శించారు.
రేపటి నుండి దత్తాశ్రమంలో
‘శ్రీమహాలక్ష్మి యజ్ఞం’
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 1: స్థానిక దత్తాశ్రమంలో శ్రావణ మాసం, కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ నెల 3 నుండి 7వ తేదీ వరకు శ్రీ లలితా సహస్ర నామ పరాయణ సహిత శ్రీమహాలక్ష్మి యజ్ఞం నిర్వహించనున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటీవ్ ట్రస్టీ టివి శివరామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 8గంటల నుండి జరిగే లలితా కోటి కుంకుమార్చనలో భక్తులు స్వయంగా పాల్గొనవచ్చన్నారు. మధ్యాహ్నం 12గంటలకు నిత్య అన్న ప్రసాదం జరుగుతుందన్నారు.