ప్రకాశం

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు జిల్లా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఆగస్టు 1:రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా బంద్ జరగనుంది. ఈ బంద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ, కాంగ్రెస్ వామపక్షాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొననున్నాయి. ముందుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు మంగళవారం వేకువజామున నాలుగుగంటలకు స్థానిక ఆర్‌టిసి గ్యారేజి వద్దకు వెళ్ళి బస్సులను నిలుపుదల చేయనున్నారు. అనంతరం ఒంగోలులో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేస్తూ మోటారుసైకిల్ ర్యాలీని నిర్వహించనున్నారు. జిల్లా బంద్‌ను జయప్రదం చేయాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనేపధ్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు, ఇన్‌చార్జులు, పార్టీముఖ్యనాయకులు పాల్గొని బంద్‌ను విజయవంతంచేసే పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా సిపిఎం,సిపిఐ నాయకులతోపాటు, కాంగ్రెస్ నాయకులు సైతం బంద్‌లో పాల్గొననున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని, లేనిపక్షంలో జిల్లా అభివృద్ధి చెందదని, ఆయాపార్టీలకు చెందిన నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకహోదా కల్పించేవరకు ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని నేతలు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థి జెఎసి కూడా బంద్‌కు మద్దతు ప్రకటించింది. ప్రత్యేకహోదా కోసం కేంద్రమంత్రులు, సీమాంధ్రమంత్రులు, శాసనసభ్యులు, ఎంపిలు రాజీమానా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి యువజన జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ఒకప్రకటనలో డిమాండ్ చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాపోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది.

రూ.2.50 కోట్లతో
శ్రీలక్ష్మీచెన్నకేశవునికి వెండిరథం
* ట్రస్టుబోర్డు చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాథం స్పష్టం
మార్కాపురం టౌన్, ఆగస్టు 1: శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామికి నూతన వెండిరథాన్ని 2కోట్ల 50లక్షల రూపాయలతో తయారు చేయనున్నట్లు దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాథం తెలిపారు. చైర్మన్ ఛాంబర్‌లో సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పలు విషయాలను తెలిపారు. ఈనెల 4వ తేదీన వెండిరథం తయారీ కార్యక్రమాలను శాస్రోక్తంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 400కిలోల వెండిని దాతల నుంచి సేకరించినట్లు, మరో 150కిలోల వెండిని సేకరించాల్సి ఉందన్నారు. దేవస్థానం అభివృద్ధికి 30 నుంచి 50లక్షల రూపాయల వరకు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇందుకు దాతలు సహకరించాలని కోరారు. ప్రస్తుతం తయారవుతున్న వెండిరథం ఉభయ తెలుగురాష్ట్రాల్లో తిరుపతిలో మినహా మరెక్కడా లేదని తెలిపారు. 22అడుగుల ఎత్తు, 8అడుగుల వెడల్పుతో వెండిరథం తయారు కానుందని, తమిళనాడు రాష్ట్రానికి చెందిన గురుగోవిందం ఈ వెండిరథాన్ని తయారు చేయనున్నట్లు తెలిపారు. 2017 రథసప్తమి నాటికి రథాన్ని సిద్ధం చేసి పట్టణ పురవీధుల్లో ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు. ఈసమావేశంలో కార్యనిర్వాహణాధికారి బి రమేష్, పిన్నిక నాగేశ్వరరావు, చక్కిలం వెంకటనారాయణరావు, కొప్పరపు శ్రీనివాసరావు, గ్రంధిశిల రామలక్ష్మయ్య, పెరుమాళ్ళ వెంకటసుబ్రహ్మణ్యం, కాశీ జ్యోతినరసింహం, సముద్రాల వెంకటరమేష్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నకేశవుని హుండీ లెక్కింపు
శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ మూడునెలల హుండీ ఆదాయాన్ని సోమవారం దేవస్థానం ఆవరణలో ట్రస్టుబోర్డు సభ్యుల సమక్షంలో లెక్కించారు. మూడునెలల హుండీ ఆదాయం 3లక్షల 22వేల 461రూపాయలు వచ్చినట్లు ఇఓ డి రమేష్ తెలిపారు. ఈకార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయశాఖ పరిశీలకులు జిఎ సత్యనారాయణ, చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాథం, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
విద్యాసంస్థల బంద్ విజయవంతం
మూతపడిన విద్యాసంస్థలు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,ఆగస్టు 1:విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల మూసివేత చర్యలన్ని విరమించుకోవాలని, మెస్ చార్జీలను పెంచాలని, మూసివేసిన హాస్టళ్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా బంద్ సోమవారం విజయవంతమైంది. జిల్లాలోని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. ఈసందర్భంగా ఎఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యాలయం నుండి బయలుదేరి మిరియాలపాలెం సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ఈసందర్భంగా కలెక్టరేట్ గేటు వద్ద విద్యార్థులు పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ పరుచూరి కుమారి నంద, వివిధ విద్యార్థిసంఘాల నేతలు ఎల్ రాజశేఖర్, పి కిరణ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హాస్టళ్లు, పాఠశాలల మూసివేత చర్యలు వలన పేద ఎస్‌సి,ఎస్‌టి,బిసి మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆరోపించారు. కాలేజిల్లో సైతం వౌలిక వసతులు సైతం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూనివర్శిటీ విద్యార్థులు అధ్యాపకులు పూర్తిస్థాయిలో లేక, ఇంజనీరింగ్ ఫీజుల పెంపు అనేక సమస్యలతో విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చర్యలను మానుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తానని వారు హెచ్చరించారు.క్రమబద్ధీకరణ పేరుతో రాష్టవ్య్రాప్తంగా ఐదువందల ప్రభుత్వ పాఠశాలలు, మూడువందల సంక్షేమ హాస్టళ్లను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్టవ్రిభజన అనంతరం రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా చేస్తారని మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. సంక్షేమహాస్టళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలను పెంచటం లేదన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇస్తామన్న ప్రభుత్వందాని ఊసే ఎత్తటం లేదన్నారు. ఈకార్యక్రమంలో ఆయా విద్యార్ధిసంఘాలకు చెందిన నాయకులు తన్నీరు శింగరకొండ, అఖిల్, మహేష్, బ్రహ్మాయ్య, లక్ష్మి, ఎం ధనరాజ్, వి జీవన్, వి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

నా పొలం ఇప్పించకపోతే
ఆత్మహత్య చేసుకుంటా..!
* కుటుంబ సభ్యులతో రైతు ధర్నా
తర్లుపాడు, ఆగస్టు 1: తాను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న పొలాన్ని ఆన్‌లైన్‌లో మరొకరి పేరు ఎక్కించారని, తన పొలాన్ని తనకు ఇప్పించాలని, లేకుంటే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఓ రైతు ధర్నా చేపట్టాడు. వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రమైన తర్లుపాడుకు చెందిన బొప్పరాజు శ్రీనివాసులు గత ఐదేళ్ళ క్రితం 1.58 ఎకరాలు కొనుగోలుచేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అందుకు రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు కూడా ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే ఇటీవల తన పొలాన్ని మార్కాపురానికి చెందిన వ్యక్తిపేరుపై ఆన్‌లైన్ చేయడం వలన ఆ వ్యక్తి దౌర్జన్యంగా తన పొలం స్వాధీనం చేసుకొని అడ్డుకుంటున్నాడని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు నిజనిజాలు తేల్చి తన పొలం ఆన్‌లైన్‌లో ఎక్కించి స్వాధీనం చేయాలని, లేకుంటే కుటుంబ సభ్యులతో కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు. దీంతో తహశీల్దార్ చంద్రలీల మాట్లాడుతూ రికార్డులు పరిశీలించి వాస్తవాలు తెలుసుకొని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో శ్రీనివాసులు ధర్నా విరమించారు.
ప్రజాసాధికార సర్వే
పకడ్బందీగా నిర్వహించాలి
* అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఆగస్టు 1: రాష్ట్రంలో ప్రజాసాధికార సర్వే ప్రజలకు ఉపయోగపడేలా పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడ నుండి ప్రజాసాధికార సర్వే కార్యక్రమంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 4కోట్ల 90లక్షల మంది ప్రజలకు సంబంధించి ప్రజాసాధికార సర్వే చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 60లక్షల మంది వివరాలు సేకరించినట్లు తెలిపారు. కేవలం 11శాతం సగటున సర్వే జరిగిందన్నారు. ఈ సర్వే వలన అర్హతగల వారందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాసాధికార సర్వే నాణ్యంగా ఉండే విధంగా తనిఖీలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ప్రజాసాధికార సర్వేను వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. ఈ సర్వేపై వారానికి ఒకసారి వీడియోకాన్ఫరెన్స్, వారానికి ఒకసారి టెలీకాన్పరెన్స్ అధికారులుతో నిర్వహిస్తామన్నారు. ఒంగోలునుండి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లాకలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ జిల్లాలో 30లక్షలమంది ప్రజలకు సంబంధించి ప్రజాసాధికార సర్వే చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు ఐదులక్షల 41వేల 756మంది వివరాలను సేకరించినట్లు చెప్పారు. ఈవీడియోకాన్ఫరెన్స్‌లో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ఒంగోలు, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ వైద్యశాలల
పనితీరు అధ్వానం
రాష్టవ్రైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని
టంగుటూరు,ఆగస్టు 1:రాష్ట్రంలోని ఒంగోలు, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ వైద్యశాలల పనితీరు అధ్వానంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం స్ధానిక కొండెపి రోడ్డులోని క్యాండిపోర్టు ఆవరణలో మక్కెన వెంకటకృష్ణారావు 54వ జయంతి సందర్భంగా బెల్లం కోటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈవైద్య శిబిరాన్ని ప్రారంభించి మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. గతంలో డెలివరి కేసులు ప్రభుత్వ వైద్యశాలలకు తక్కువుగా వచ్చాయని తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత 35శాతంనుండి 50శాతం వరకు డెలివరికేసులు ప్రభుత్వ వైద్యశాలలకు వస్తున్నారని తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా శిశుమరణాల రేటు తగ్గిందని అందుకు సంబంధించి కేంద్రప్రభుత్వం అవార్డు ఇచ్చిందన్నారు. టంగుటూరు ప్రభుత్వ వైద్యశాలను 30 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
దివంగత మక్కెన వెంకటకృష్ణారావు కుటుంబసభ్యులు ప్రతి సంవత్సరం సేవా భావంతో నిరంతరం ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించటం అభినందనీయమన్నారు. విజయవాడలోని ఆంధ్రాసూపర్ స్పెషాలిటి వైద్యులు గత నాలుగుసంవత్సరాలుగా ఉచిత వైద్యశిబిరానికి వచ్చి వైద్యశిబిరంలో పాల్గొని వైద్యసేవలు అందించటం అభినందనీయమన్నారు. కృష్ణారావు భౌతికంగా లేకపోయినా వారి కుటుంబసభ్యులు ఉచిత వైద్యశిబిరం నిర్వహించటం అభినందనీయమని సేవా కార్యక్రమాల ద్వారా కృష్ణారావు ఆత్మశాంతిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌పి త్రివిక్రమవర్మ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్ధితుల్లో డయబెటిక్ బాగా పెరిగిపోతుందని ప్రతిఒక్కరు ప్రాధమిక పరీక్షలు చేసుకునేందుకు ఇలాంటి ఉచిత వైద్యశిబిరాలు ఉపయోగపడుతాయన్నారు. ఒబిసిటి రావటం వలన పిల్లలకు పెట్టాల్సిన ఆహారం గురించి ప్రతిఒక్కరు అవగాహన కలిగిఉండాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త బెల్లం కోటయ్య మాట్లాడుతూ ఈ ఉచిత వైద్యశిబిరం రెండురోజులు ఉంటుందని తమ తమ్ముడు బెల్లం రామయ్య వర్ధంతి సందర్బంగా మంగళవారం నాడుకూడా ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టంగుటూరు గ్రామాన్ని అభివృద్దిచేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. టంగుటూరు మండల ప్రాథమిక ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని మంత్రిని కోరారు. జిల్లాతెలుగుదేశంపార్టీఅధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల మాట్లాడుతూ కృష్ణారావుకుటుంబసభ్యులు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించటం అభినందనీయన్నారు. టంగుటూరు గ్రామాభివృద్దికి తనవంతుకృషిచేస్తానని తెలిపారు. కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ కృష్ణారావు కుటుంబసభ్యులు ప్రతిసంవత్సరం ఉచిత వైద్యశిబిరాలు, అనాధలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించటం వారి దాతృత్వానికి నిదర్శమన్నారు. ఈకార్యక్రమంలో యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు, జిల్లాడైయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి యాస్మిన్, మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య, దివిశివరాం, బిజెపి నాయకులు బత్తిన నరసింహరావు, జడ్‌పిటిసి సభ్యురాలు పి కోటేశ్వరమ్మ, ఎంపిపి చదలవాడ చంద్రశేఖర్, సర్పంచ్ బెల్లం జయంతిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వైద్యశిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా మందులను,్భజన వసతిని కల్పించారు.