మహబూబ్‌నగర్

ప్రిన్సిపాల్ తమకొద్దంటూ...విద్యార్థుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, ఆగస్టు 2: ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ విజయ రాణి మాకొద్దంటూ విద్యార్థులు సుమారు 2గంటల పాటు కొత్తకోటలో రాస్తారోకో నిర్వహించారు. మంగళవారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు కొత్తకోట చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పురుగుల అన్నం పెడుతున్నారని, ఇట్టి విషయాన్ని ప్రిన్సిపాల్ విజయ రాణిని తెలిపిన పట్టించుకోవడం లేదని హాస్టల్‌లో ఫ్యాన్లు సరిగ్గా లేవని, బూత్ రూమ్‌లకు డోర్లు లేవనే విషయాన్ని ప్రిన్సిపాల్‌కు వివరిస్తే ఇక్కడ మగ పిల్లలు ఉంటారా అని వేంగ్యమాటలు మాట్లాడుతున్నారని, కూల్లిన కూరగాయాలతో వడ్డిస్తున్నారని చెబితే పంటలు పండించి తెచ్చి వండుతానని సమాదానం చెబుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. అలాగే గత ఏడాది నుండి ఎకానమిక్స్ పాఠలు చెప్పకపోవడంతో తాము ఎంతో నష్టపోయామని, క్లాసులు చెప్పాలని ప్రిన్సిపాల్‌ను వేడుకున్నా చెప్పకపోవడంతో ఆ సబ్జెక్టు ఫైల్ అయినట్లు విద్యార్థులు తెలిపారు. గత మూడు రోజుల నుండి నాణ్యమైన భోజనాన్ని పెట్టడం లేదని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకవెళ్లిన రాత పూర్వకంగా రాసి ఇవ్వాలని విద్యార్థులకు చెబుతున్నట్లు తెలిపారు. కానీ ఉప్మాలో కూడా పురుగులు రావడం, మిరుపొడి పెట్టడం వంటి విషయాలు కూడా ప్రిన్సిపాల్‌కు చెప్పిన ఫలితం లేకుండాపోయిందని, ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకొని బదిలీ చేయాలని విద్యార్థులు బిస్మించి చౌరస్తాలో కూర్చున్నారు. విషయం తెలుసుకున్న తహశీల్ధార్ ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి ఫోన్లో కలెక్టర్ టి.కె శ్రీదేవితో మాట్లాడి అక్కడ క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశించారు. డిప్యూటి డి ఇ ఓ నారాయణ పాఠశాల వద్దకు చేరుకొని విద్యార్థుల నుండి రాత పూర్వకంగా పిర్యాదు తీసుకొని విచారణ చేపట్టారు.
అంతకు ముందు విద్యార్థులు రాస్తారోకో విరమింపజేయకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా గత ఏడాది ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగానే ఓ విద్యార్థి భీమా కాల్వలో పడి మృతి చెందగా అట్టి సంఘటనలో ప్రిన్సిపాల్ సస్పెండ్ అయి తిరిగి అదే పాఠశాలకు పోస్టింగ్ తెచ్చుకున్నారు. కావాలనే విద్యార్థులను వేధించడానికే ఇక్కడికి వచ్చారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.