మహబూబ్‌నగర్

బాధ్యతారహితంగా వ్యవహరిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, ఆగస్టు 2: బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకద్ర పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హల్‌లో హరితహారంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇప్పటికి 9.50లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా కేవలం 1.35లక్షల మొక్కలు నాటడం బాధ్యతారహితంగా కనిపిస్తుందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాల్సి ఉండగా సాకులు చెబుతూ భాద్యతను దాటవేస్తున్నారని అన్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి బాధ్యతాయుతంగా వ్యవహరించి మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని తెలిపారు. అధికారులు తమ విధుల్లో ఆలసత్వం వహిస్తున్నారని అలాంటి వారు విధుల నుండి తప్పుకోవాలని హెచ్చరించారు. ఈ నెల 10వ తేది నాటికి ప్రతి గ్రామంలో 20వేల మొక్కలు నాటాలని ఇందుకు గ్రామ సర్పంచు, విఆర్‌ఓ, విఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శి, ఫిల్డ్ అసిస్టెంట్లు, మహిళా సంఘాలు కలిసి ఉద్యమంలా మొక్కలు నాటి వాటిని సంరక్షించే భాద్యతను తీసుకోవాలని ఆయన అన్నారు. మొక్కలు వృక్షాలుగా మారినప్పుడు వర్షాలు సంవృద్దిగా కురిసి రైతుల కష్టలు తీరుతాయని అన్నారు. రైతన్న సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందన్నారు. 10వ తేదీన అధికారులతో మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహిస్తానన్నారు. దేవరకద్రను రాష్ట్రంలోనే ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి దేవరకద్రలోని ఎర్రకుంట చెరువుకట్టపై ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు కొండ శ్రీను ఆధ్వర్యంలో 1500 ఈత మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపిపి ఇవి గోపాల్, ఎంఆర్‌ఓ హరిలాల్, ఎంపిడిఓ భాగ్యలక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జట్టి నరసింహరెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఎపిఓ లత, రఘువర్మ, హన్మంతురెడ్డి పాల్గొన్నారు.