కరీంనగర్

గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా వంగరకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, ఆగస్టు 2: గౌరవెల్లి రిజర్వాయర్ నుండి దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామమైన వంగరకు సాగునీటిని 2018 సంవత్సరంలోగా అందిస్తామని హు స్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పేర్కొన్నారు. 1993లో ఆనాడు పివి ప్రధానిగా ఉన్న సమయంలో వంగరకు సాగునీటిని అందిస్తామన్నారు. నేడు వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు నింపి దాని నుండి గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా వంగరకు సాగునీరు అందిస్తామన్నారు. వంగరలో వైద్యులతో త్వరలో మెడికల్ మెగా హెల్త్‌క్యాంపు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పేర్కొన్నారు. వంగరలోని జిల్లాపరిషత్ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్తకు చేరుకుందని ప్రధానోపాధ్యాయులు తెలుపగా పాఠశాల భవన నిర్మాణం కోసం మూడు కోట్ల నిధులు అందిస్తామని ఎమ్మెల్యే సతీష్ చెప్పారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో బాత్‌రూములు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కోసం ఎసిడిపి పథకం ద్వారా పది కోట్ల నిధులు ఖర్చు చేస్తామన్నారు. హరితహారంలో భాగంగా వంగర గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే సతీష్, పివి కుటుంబ సభ్యులు పివి ప్రభాకర్ రావు, సీతారామారావు తదితరులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో పివి కుమారులు పివి ప్రభాకర్ రావు, పివి సీతారామారావు, పివి శరత్, పివి సోదరుని కుమారులు పివి మదన్‌మోహన్, ఎంపిపి సంపత్ యాదవ్, జడ్పీటిసి రాంచందర్ నాయక్, ఎస్‌ఐ హరిప్రసాద్, ప్రధానోపాధ్యాయులు సాంభశివరావు, వంగర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.