బిజినెస్

హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాభం రూ. 2,047 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశీయ ఐటి రంగంలో నాలుగో అతిపెద్ద సంస్థగా ఉన్న హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 2,047 కోట్ల రూపాయలుగా నమోదైంది.
గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్- జూన్‌లో 1,783 కోట్ల రూపాయల లాభాన్ని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ అందుకుంది. దీంతో ఈసారి లాభం 14.8 శాతం పెరిగినట్లైంది. ఇక ఆదాయం కూడా 15.9 శాతం పెరిగింది. ఈసారి 11,336 కోట్ల రూపాయలుగా, పోయినసారి 9,777 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం సంస్థ తెలియజేసింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సంస్థ వృద్ధిరేటు 12-14 శాతంగా ఉండొచ్చని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ అంచనా వేసింది. భారతీయ ఐటి పరిశ్రమ వృద్ధికి సంబంధించి 10-12 శాతంగా ప్రకటించిన నాస్కామ్ అంచనా కంటే ఇది ఎక్కువగా ఉండటం గమనార్హం.
కాగా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కంటే ముందు దేశీయ ఐటి రంగంలో అగ్రశ్రేణి సంస్థలైన టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇప్పటికే ఫలితాలను ప్రకటించినది తెలిసిందే.