బిజినెస్

వచ్చే రెండు నెలల్లో రూ. 16 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రతి నెలా కనీసం ఒకటైనా బైబ్యాక్ ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో రూ 16,000 కోట్లకు పైగా నిధులు తన డిజినె్వస్ట్‌మెంట్ ఖజానాకు చేరుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణకు మామూలుగా అనుసరించే ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) మార్గానే్న కాకుండా తమ వద్ద గనుక అదనపు నిధులు ఉంటే షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కొత్తగా ఏర్పాటుచేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇనె్వస్ట్‌మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజిపెంట్ (డిఐపిఎఎం) ఒత్తిడి చేస్తోంది. ఇప్పటికే అయిదు ప్రభుత్వ రంగ సంస్థల - కోల్ ఇండియా, ఎన్‌ఎండిసి, నాల్కో, ఎంఓఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్- బోర్డులు బైబ్యాట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటా 75-81 శాతం మధ్య ఉన్నాయి. అందువల్ల దానికి అనుగణంగా షేర్ల బైబ్యాక్‌ను నిర్వహిస్తారు. ఈ అయిదు కంపెనీల బైబ్యాక్‌లన్నీ కలిపి ప్రభుత్వ ఖజానాకు 13,500 కోట్ల రూపాయల దాకా లభించనున్నాయి. ఇదికాక ఎన్‌హెచ్‌పిసిలో వాటా, ఐఓసిలో ఉద్యోగి చందా, ఎన్‌టిపిసిలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 3,183 కోట్ల రూపాయల ఆదాయం ఇప్పటికే వచ్చింది. ఇదంతా కలిపితే రాబోయే రెండు నెలల్లో బైబ్యాక్ ప్రక్రియ అంతా పూర్తయ్యే నాటికి రూ 16,000 కోట్ల దాకా వస్తాయని తాము ఆశిస్తున్నామని ఓ ఉన్నతాధికారి చెప్పారు.