తెలంగాణ

కృష్ణమ్మ పిలుస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 10: పనె్నండేళ్లకు ఓసారి వచ్చే పుష్కర సంబరం మరో 24 గంటల్లో ఆరంభం కానుంది. రాష్ట్రంలో కృష్ణానది మహబూబ్‌నగర్ జిల్లాలోనే తంగిడిగి దగ్గర తొలి అడుగు పెట్టనుంది. అక్కడి నుండి దాదాపు 300 కిలోమీటర్లకు పైగా మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవహించే కృష్ణమ్మ సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. కృష్ణానది తీరంలో ఎటుచూసినా శోభాయమానమైన వాతావరణం విరాజిలుతోంది. భక్తజనకోటి పుణ్యస్నానాలను ఆచరించేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్ల దగ్గర ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఓ పక్క కృష్ణానది ప్రవాహం పెరుగుతుండడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానది నిండుకుండలా ప్రవహిస్తూ భక్తులకు తన అందాలను కళ్లారా చూసేందుకు కృష్ణమ్మ అవకాశం ఇస్తోంది.
కొత్త రాష్ట్రంలో కృష్ణానదికి మొట్టమొదటి పుష్కరాలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు దాదాపు రూ.800 కోట్ల నిధులను కేటాయించింది. అందులో ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాకే రూ.425 కోట్లకుపైగా నిధులు ఇచ్చింది. ఈ నిధులతో మహబూబ్‌నగర్ జిల్లాలో 52 పుష్కరఘాట్లను ఏర్పాటు చేయగా ఇందులో 32 పుష్కరఘాట్లు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి అవకాశం ఉంది. బీచుపల్లి దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. బీచుపల్లి బ్రిడ్జిని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఆ ప్రాంతమంతా శోభాయమానంగా తయారైంది. బీచుపల్లి దగ్గర దేవాలయాలకు కృష్ణా పుష్కరాల శోభ సంతరించుకుంది. అదేవిధంగా రంగాపూర్ పుష్కరఘాట్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. ఎటుచూసినా విద్యుద్దీపాల అలంకరణతో రంగనాయకస్వామి దేవాలయాన్ని భక్తిపారవశ్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. కృష్ణమ్మ చెంతకు కోటి మందికిపైగా భక్తులు పుష్కర స్నానం ఆచరించే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.