బిజినెస్

బిగ్ బాస్‌ల కంటే.. ఎస్ బాస్‌ల జీతాలే ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 16: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పైస్థాయి ఉద్యోగుల కంటే కిందిస్థాయి ఉద్యోగులకే జీతాలు అధికంగా వస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఇందుకు తాను కూడా మినహాయింపు కాదని చెప్పారు. మంగళవారం ఇక్కడ ఓ బ్యాంకింగ్ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ బ్యాంకులకు, ప్రైవేట్‌రంగ బ్యాంకులకు మధ్య కూడా ఉద్యోగుల జీతాల్లో భారీ వ్యత్యాసాలున్నాయన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో దాదాపు 31.1 లక్షలు వేతనంగా పొందారు. ఇదే సమయంలో ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్యా పురి వేతనం 9.7 కోట్ల రూపాయలు. ఈ మేరకు బ్యాంకింగ్ రంగ సంస్థలు విడుదల చేసన వార్షిక నివేదికలు చెబుతున్నాయని రాజన్ అన్నారు. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకుల రుణ మంజూరు పద్ధతిలో మార్పు రావాలని, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో భద్రత పెరగాలని కూడా చెప్పారు. వచ్చే నెల 4తో రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగుస్తుండగా, ఆ తర్వాత మళ్లీ ఆయన అధ్యాపక వృత్తిలోకే వెళ్లనున్నది తెలిసిందే.

chitram ..బ్యాంకింగ్ సదస్సులో మాట్లాడుతున్న రాజన్