విజయనగరం

పిహెచ్‌సిలో డాక్టర్‌ను నియమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరకముడిదాం, ఆగస్టు 19: మండలంలోని గర్భాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యాధికారిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఆసుపత్రిని 24గంటలూ పనిచేసే ఆసుపత్రిగా స్థాయి పెంచి సుమారు 12ఏళ్లు దాటింది. స్థాయి పెంచినంతవరకూ బాగానే ఉన్నా వసతులు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారని చెప్పకతప్పదు. ఈ ఆసుపత్రి చుట్టుప్రక్కల సుమారు 10గ్రామాలకు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు రోగుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ సుమారు రోజుకు 150నుండి 200మంది వరకూ రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ వైద్యాధికారి లేకపోవంతో రోగులు నానాఅవస్థలు పడుతున్నారు. గరివిడి పిహెచ్‌సి నుండి డిప్యుటేషన్‌పై వచ్చిన వైద్య అధికారిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి గరివిడి పంపించి వారంరోజులు దాటింది. అయినా ఆ స్థానంలో నేటికి వైద్యాధికారిని నియమించకపోవడం ఉన్నతాధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. గరివిడి నుండి వచ్చిన డాక్టర్ ప్రతిరోజు అందుబాటులో ఉండడంతో ఇక్కడ ఒపి 200కుపైగా పెరిగింది. ప్రస్తుతం డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గర్భాం పిహెచ్‌సికి వైద్య అధికారిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.