కరీంనగర్

భయం..భయం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సాప్ట్‌వేర్ ఇంజనీర్ తల్వార్‌తో వీరంగం
* ప్రాణభయంతో పరుగులు తీసిన జనం
* పేరెంట్స్‌ను సైతం విడిచిపెట్టని బల్వీందర్‌సింగ్
* పోలీసు కాల్పులకు బలైన సాప్ట్‌వేర్ ఇంజనీర్
* మృతదేహాంతో వన్ టౌన్ ఠాణా ఎదుట ధర్నా
* కరీంనగర్‌లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు
కరీంనగర్, డిసెంబర్ 22: అప్పుడే తెల్లారింది. రోడ్లపై మెల్లమెల్లగా జన సంచారం మొదలవుతోంది. అకస్మాత్తుగా ఓ యువకుడు తల్వార్‌తో బీభత్సం సృష్టించడంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ రహదారి అలజడికి గురైంది. ఆ యువకుడి కత్తి వీరంగంతో అసలు ఏమి జరిగిందో తెలియని అయోమయపరిస్థితుల్లో ఆ రోడ్డుపై వెళ్తున్న జనాలు భయం భయంగా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఉన్మాదిగా మారిన యువకుడు తల్లిదండ్రులను సైతం వదిలిపెట్టలేదు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడం, వారిపైకి దాడికి దిగడంతో వన్ టౌన్ సిఐ తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్చడంతో చివరకు సాప్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. ఉన్నత చదువులు చదవి మంచి ఉద్యోగంలో స్థిరపడిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ బల్వీందర్‌సింగ్ ఒక్కసారిగా ఉన్మాదిగా మారడం, తల్లిదండ్రులతోపాటు ఇతరులపై దాడిచేయడం, చివరకు పోలీసు పైరింగ్‌లో బల్వీందర్ (26) మృతి చెందడంలాంటి విషాద సంఘటన సంచలనం సృష్టించగా, మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది. అటు బల్వీందర్ దాడిలో తల్లిదండ్రులు అవతార్‌సింగ్, సత్వంత్‌బేబికౌర్, హెడ్‌కానిస్టేబుల్ మల్లయ్య, కానిస్టేబుల్ మీర్ అలీ, ఆటో డ్రైవర్ శ్రీమన్నారాయణ, అల్వాల్‌కు చెందిన కీర్తన, ఆమె తండ్రి జయాకర్, వినయ్‌కుమార్‌లతోపాటు మరికొందరు గాయపడ్డారు. అయితే, కాళ్లపై కాల్పులు జరిపి అదుపుచేయాల్సి ఉండగా, కడుపు భాగంలో కాల్పులు జరపటడంతో చనిపోయాడని, కాల్పులు జరిపిన సిఐపై హత్య కేసు నమోదు చేయాలంటూ మృతుడి బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా, పోలీసులు భారీగా ఆసుపత్రిలో మోహరించారు. ఓఎస్డీ సుబ్బారాయుడు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. చివరకు సాయంత్రం నిబంధనల ప్రకారం డాక్టర్ల బృందంతో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయినా, శాంతించని బంధువులు మృతదేహాంతో వన్ టౌన్ ఎదుట రాత్రి ఆందోళనకు దిగారు. దీంతో కరీంనగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, బల్వీందర్‌సింగ్ తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారి పరిస్థితి మరీ దయనీయం. ఒక్కగానొక్క కొడుకు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోవడం, ఇప్పటివరకు ఉన్న ఆ ఆధారం దూరం కావడం లాంటి పరిణామాలు ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేపోతున్నారు. మరోవైపు పోలీసు కాల్పులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదుపు చేసేందుకు ఇతరత్రా పద్ధతులు ఉపయోగించాల్సి ఉండేదని, అలాకాని పక్షంలో కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాది ‘కసబ్’ లాంటి వాడినే ఎన్‌కౌంటర్ చేయకుండా అరెస్ట్ చేయగా, ఏలాంటి నేరచరిత్ర లేని బల్వీందర్‌సింగ్ విషయంలో మాత్రం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఏదిఏమైనా ఊహించని ఈ సంఘటనతో జిల్లా కేంద్రమైన కరీంనగర్ ఉలిక్కిపడింది.