ఆంధ్రప్రదేశ్‌

స్పీకర్ వద్దకు పంచాయతీ అసెంబ్లీ సెక్రటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: ఏపి శాసనసభ కార్యదర్శి విద్యార్హతపై జరుగుతున్న వివాదం స్పీకర్ కోర్టుకు చేరింది. ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరిస్తోన్న సత్యనారాయణకు తగిన విద్యార్హత లేనందున, ఆయన ఆ పదవికి అనర్హుడని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమాచార హక్కు కమిషనర్‌ను ఆశ్రయించినా ఫలితం కనిపించకపోవడంతో, ఆయన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి సత్యనారాయణ విద్యార్హతపై మొదటి నుంచి వివాదం జరుగుతోంది. తమతో అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహంతో ఉన్న వైసీపీ శాసనసభాపక్షానికి, ఆయన విద్యార్హత ఒక అవకాశంగా లభించింది. దీనితో సత్యనారాయణ విద్యార్హతను వెలుగులోకి తీసుకురావడం చర్చనీయాంశమయింది. కార్యదర్శి సత్యనారాయణకు ఎలాంటి డిగ్రీ లేనందున ఆయన ఆ పదవికి అనర్హుడని ఎమ్మెల్యే ఆళ్ల, స్పీకర్ కోడెలకు తాజాగా రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. నిజానికి కార్యదర్శి పదవికి న్యాయశాస్త్ర పట్టా అవసరం. చట్టాల రూపకల్పనలో కార్యదర్శి సలహాలు అవసరం ఉంటుంది. అంత ప్రాధాన్యం ఉన్న పోస్టును ఎలాంటి డిగ్రీ లేని సత్యనారాయణకు ఎలా ఇస్తారన్న ప్రశ్న వైసీపీ శాసనసభాపక్షం నుంచి ఎదురయింది. సత్యనారాయణ డిగ్రీకి సంబంధించి ఏపి సమాచార హక్కు కమిషనర్‌కు ఎమ్మెల్యే ఆళ్ల లేఖ రాశారు. అయితే ఆ కార్యాలయానికి నిర్ణీత గడువులోగా ఎలాంటి సమాచారం అందలేదు. ఆరు నెలల తర్వాత ఎమ్మెల్యేకు అసెంబ్లీ ప్రజా సమాచార అధికారి నుంచి ఒక లేఖ వచ్చింది. కానీ అందులో సత్యనారాయణ డిగ్రీకి సంబంధించిన సమాచారం లేదని, ప్రస్తుతం అసెంబ్లీలో పనిచేస్తున్న ఇద్దరు డిప్యూటీ కార్యదర్శుల వివరాలు మాత్రమే పంపించారని ఆళ్ల తెలిపారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఇప్పటికే గవర్నర్‌కూ ఫిర్యాదు చేశారు. అయితే , ఇదంతా తనంటే గిట్టని వారు చేస్తున్న దుష్ప్రచారమేనని అసెంబ్లీ ఇన్చార్జి సెక్రటరీ సత్యనారాయణ చెప్పారు. 1978లో తాను ఉద్యోగంలో చేరానని, అప్పుడు డిగ్రీ అవసరం లేదన్నారు. ‘నాకు లా డిగ్రీ లేదన్న విషయం సిఎం, గవర్నర్, స్పీకర్‌కూ తెలుసు. అదే ఉంటే ఇన్‌చార్జి సెక్రటరీగా ఎందుకు ఉంటాను? సెక్రటరీగానే ఉండేవాడిని కదా? అయినా ఇది అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారం కదా’ అని వ్యాఖ్యానించారు. తన పోస్టు కోసం ప్రయత్నిస్తున్న కొందరు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనని, అయినా ఇది స్పీకర్ పరిధిలో ఉందని చెప్పారు.