విజయనగరం

వైన్‌షాపులను మూసివేయాలని మహిళల బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 30: పట్టణం నడిబొడ్డులో శాంతినగర్‌కు వెళ్లే బీసెంట్ స్కూల్ రోడ్డులో ఉన్న రెండు వైన్‌షాపులను మూసివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం రోడ్డుపై మహిళలు బైఠాయించారు. గుడి,బడి ఉన్న ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ షాపులను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ షాపులను తక్షణమే మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. షాపుల ముందు ధర్నా చేసిన మహిళలు సుమారు మూడు గంటల సేపు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మహిళలకు మద్దతుగా తెలుగుదేశంపార్టీకి చెందిన 36వ వార్డు కౌన్సిలర్ కెల్ల వరలక్ష్మి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బి.రమణమ్మ, కార్మిక నాయకుడు బెహరా శంకరరావు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర బైఠాయింపులోపాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వన్‌టౌన్ సిఐ వెంకట అప్పారావు, ఎస్‌ఐ వెంకటరమణ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పెద్దసంఖ్యలో చేరుకున్న మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షాపులను ఎత్తివేసే వరకూ కదిలే ప్రసక్తి లేదని భీష్మించడంతో సిఐ వెంకట అప్పారావు మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. ఈ షాపులను వెంటనే మూసివేయాలని వారు డిమాండ్ చేయడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు వైన్‌షాపులను ఏర్పాటు చేశారని, ఇందులో తాము చేసేదేమి లేదని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీసులను నియమిస్తామని సిఐ చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళతామని, ఆందోళన విరమించుకోవాలని ఆయన కోరారు. దీంతో మహిళలు సరేమిరా అన్నారు. కలెక్టర్ ఇక్కడి రావాలని వారు డిమాండ్ చేయగా, ఇక్కడికి కలెక్టర్ వచ్చే అవకాశం లేదని, మీరే కలెక్టర్ దగ్గరకు వెళ్లాలని ఆయన చెప్పటంతో మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు గుడి..మరో బడి ఉంటే నిబంధనలకు విరుద్ధంగా వైన్‌షాపులను ఎలా ఏర్పాటు చేస్తారని వారు ప్రశ్నించారు. ఈ షాపులను తెలుగుదేశం పార్టీకి చెందిన లోకేష్ యువసేన నాయకుడని చెప్పుకుంటూ ఒక నాయకుడు, వైకాపాలో యువజన నాయకుడిగా చెలామణి అవుతున్న ఒక యువనేత నిర్వహిస్తున్నారని, రాజకీయ పలుకుబడి ఉన్న ఈ నాయకులు నీతికబుర్లు చెబుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఈ షాపులను మూసివేయాలని గతంలో ఎక్సైజ్ అధికారులను కోరామని, అయినప్పటికీ కనీసం స్పందించలేదని వారు వాపోయారు. ప్రతీరోజూ తెల్లవారున నాలుగు నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు షాపులను నిర్వహిస్తున్నారని, తాగుబోతుల సంచారం పెరగటంతో మహిళలు రోడ్డపై వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తక్షణమే వైన్‌షాపులను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు.

సార్వత్రిక సమ్మెకు మద్దతుగా
సిపిఐ సైకిల్ ర్యాలీ
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వచ్చేనెల 2వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి బుగత సూరిబాబు కోరారు. సార్వత్రిక సమ్మెకు మద్ధతుగా సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి నాయకత్వంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వం కార్మిక చట్టాలు, హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మికవర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. రైల్వే, బ్యాంకింగ్, విమానయానం, రక్షణ, ఇన్స్యూరెన్స్ తదితర తొమ్మిది కీలక రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ)కు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. ఈ నేపధ్యంలో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పేందుకు జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘గిరిజన విద్యార్థులకు
మెరుగైన వైద్యసేవలు అందించాలి’
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 30: గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని మైదాన ప్రాంతం గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ రఘుపతుల శశిభూషణ్ డిమాండ్ చేశారు. కోట జంక్షన్ నుంచి ఆనందగపతి ఆటోడియం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించి రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళినికి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శశిభూషణ్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల మరణాలను అరికట్టాలని, మరణించిన విద్యార్థులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అన్నారు. గిరిజన విద్యార్థులకు స్కాలర్‌షిష్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన హస్టళ్లలో మెస్‌ఛార్జీలను పెంచడంతోపాటు మెనూ సక్రమంగా అమలు చేయాలని తెలిపారు. ఐటిడిఎలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టాలని చెప్పారు. ఉద్యోగులను వేధిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న గిరిజన నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర, జిల్లా కోశాధికారి పెదకాపురాజు పాల్గొన్నారు.

ఆంధ్రభూమి బ్యూరో