బిజినెస్

క్షీణించిన కోల్ ఇండియా లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016- 17) తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో 3,065.28 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే వ్యవధిలో 3,596.93 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ అందుకుంది. దీంతో ఈసారి లాభం 14.7 శాతం క్షీణించినట్లైంది. ఇక నికర అమ్మకాలు ఈసారి 17,796.05 కోట్ల రూపాయలుగా ఉండగా, పోయినసారితో చూస్తే ఇది 6.1 శాతం తక్కువని మంగళవారం సంస్థ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. మొత్తం సంస్థాగత వ్యయం ఈ ఏప్రిల్-జూన్‌లో 14,834.20 కోట్ల రూపాయలుగా, గత ఏప్రిల్-జూన్‌లో 15,320.81 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, స్టాండలోన్ ఆధారంగా చూస్తే సంస్థ నికర లాభం ఈసారి 3.68 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడు 487.10 కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. ఉత్పత్తి ఈసారి 125.67 మిలియన్ టన్నులుగా, క్రిందటిసారి 121.35 మిలియన్ టన్నులుగా ఉందని సంస్థ తెలియజేసింది.