బిజినెస్

వాటా అమ్మనున్న ‘హెరిటేజ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ప్రముఖ వ్యాపారవేత్త కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపునకు వాటాను అమ్మేందుకు గల అవకాశాలపై ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సోమవారం వెల్లడించింది. వ్యాపారంలో అనుబంధాన్ని ఏర్పరచుకునేందుకు గల అవకాశాలపై రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని, అయితే ప్రస్తుతం ఈ చర్చలు స్వభావ రీత్యా ‘అనే్వషణాత్మక’ దశలోనే ఉన్నాయని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజికి ఇచ్చిన వివరణలో హెరిటేజ్ ఫుడ్స్ పేర్కొంది. రిటైల్ వ్యాపారాన్ని ఫ్యూచర్ గ్రూపునకు అమ్మేందుకు తాము జరుపుతున్న చర్చలు పురోగమన దిశలో ఉన్నట్లు వచ్చిన వార్తలకు స్పందిస్తూ హెరిటేజ్ ఫుడ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు 1992లో స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ డెయిరీ, రిటైల్, అగ్రి, బేకరీ, పునర్వినియోగ ఇంధనం, పశువుల మేత తదితర రంగాల్లో వ్యాపార కార్యకలాపాలను సాగిస్తూ గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 2,380.58 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది.

ఎంఆర్‌పిఎల్ పన్ను ఎగవేతపై
రెవెన్యూ అధికారుల దృష్టి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఓఎన్‌జిసికి అనుబంధంగా పనిచేస్తున్న మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పిఎల్) దాదాపు 10 కోట్ల రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని ఎగ్గొట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆ సంస్థపై కేంద్ర రెవెన్యూ విభాగ అధికారులు దృష్టి సారించారు. న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజన్స్ ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి మంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎంఆర్‌పిఎల్ నుంచి కొన్ని వివరణలు కోరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎంఆర్‌పిఎల్ ఉత్పత్తి చేస్తున్న సుగంథ భరిత ద్రవ హైడ్రోకార్బన్ ‘మిక్స్‌డ్ జిలేన్’కు తప్పుడు క్లాసిఫికేషన్ ఇచ్చినందుకు ఈ కేసు నమోదైందని ఆ వర్గాలు తెలిపాయి. జిలేన్‌ను మినరల్ ఆయిల్‌గా ప్రకటించి 14 శాతం సుంకాన్ని చెల్లించాల్సి ఉండగా, దానిని ఆర్గానిక్ కెమికల్‌గా పేర్కొంటూ 12.5 శాతం మాత్రమే సుంకాన్ని చెల్లిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఎంఆర్‌పిఎల్‌పై కేసు నమోదైందని అధికార వర్గాలు వివరించాయి.