సంపాదకీయం

దారిలేని నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చినుకుపడితే చాలు..నగరాలు పట్టణాలు నీటి మడుగులుగా మారిపోతుండడానికి ఏకైక కారణం అతార్కికమైన, దుర్మార్గమైన పట్టణీకరణ. కేంద్రీకరణ ఈ క్రూరమైన పట్టణీకరణకు ప్రాతిపదిక! ఒక ఇల్లు ఉండవలసిన చోట ఒక కుటుంబం నివసించవలసిన చోట పది ఇళ్లు ఒకదానిమీద ఒకటి నిలువునా నిలబడి ఉండడం పది కుటుంబాలవారు కూరుకుని పోయి ఉండడం కాలుష్య కేంద్రీకరణకు సూత్రం...్భష్యాలు ఎన్నైనా చెప్పవచ్చు, అసంఖ్యాక ఉదాహరణల ద్వారా ఈ సూత్రం సాధించిన వైపరీత్యాలను వివరించవచ్చు! చినుకు పడితేనే నేలంతా చీదర చీదర...హైదరాబాద్ ప్రధాన చర్చనీయాంశం కావడం ప్రతీక మాత్రమే! ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్నినగరాలు నరకాలుగా మారడానికి పది చినుకులు రాలడం చాలు! డెబ్బయి ఏళ్ల స్వాతంత్య్రం తరువాత దేశమంతటా ఒకే నమూనా పట్టణీకరణ జరిగిపోయింది! చినుకులు పొడిపొడిగా రాలగానే నేలపైన అంతవరకు నిక్షిప్తమైన, కొలువుతీరి ఉన్న కిళ్లీల ఉచ్చిష్ట అవశేషాలు మరింత ఎఱ్ఱగా మారి భయంకర దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. ముక్కులు బద్దలైపోవడానికి దోహదం చేసే వాసనలను వెదజల్లుతాయి...అక్కడ మొదలు! వీధుల్లో నడుస్తున్న వారికి బతుకులపై విరక్తి కలగడానికి వీలయినన్ని దృశ్యాలు, దుర్గంధాలు నగరాలలోను పట్టణాలలోను కోకొల్లలు! పది చినుకులు పడితేనే ఇదంతా జరిగిపోతోంది, పది రోజులపాటు ఎడతెగని వర్షం కురిసినపుడు నగరాల జీవనం కంటె నరకంలో జీవించడం మేలని జనం భావించడం అత్యంత సహజం. ఊరు ఉప్పెనగా మా రుతోంది, వీధులన్నీ మురికి నీటి వైతరణీ ప్రవాహాలు..ఈ ప్రవాహాలు, ఈ వైతరణీ నదులు బస్తీలలోకి, వాడలలోని ఇళ్లలోకి చొరబడడం పాత కథ... అత్యం త విలాసవంతమైన భవన సముదాయాల-అపార్టుమెంట్ కాంప్లెక్సులు-ప్రాంగణాలు నీటి మడుగులుగా మారుతుండడం నేటి కథ...దీనికి తోడు విద్యుత్ సరఫరా ఆగిపోతుంది! నగరం మొత్తం భయంకర ఘోరతమాల వాటిక! కింద మురికి నీరు, పైన దోమల హోరు, చుట్టూ చీకటి తెర! వానరాగానే కరెంటు ఆగిపోవడం ప్రగతికి ప్రతీక...విజయానికి పరాకాష్ట! కొత్తగా స్వచ్ఛ భారత్ అభియానం ఆరంభమైంది, హైదరాబాద్ బృహత్ నగరం మధ్యలోని వినాయకసాగర్-హుస్సేన్‌సాగర్ నుండి దుర్గంధపు నురుగు ఉరకలెత్తి రహదారులలోకి దూకుతోంది! హైదరాబాద్ 2004వ సంవత్సరానికి పూర్వమే నమూనా నగరం..ఆదర్శ ప్రగతి పరిమళాల వాటిక! అమరావతిని కూడ హైదరాబాద్‌కంటె గొప్పగా నిర్మించడం నడచిపోతున్న ఆర్భాటం..కాలుష్యపుకేంద్రీకరణ మూల సూత్రం..
ఈ కేంద్రీకరణ కారణంగా నీరు ముందుకు సాగిపోకుండా ఎక్కడికక్కడ ఆగిపోతున్నది. దిక్కు తెలియని నీరు, దారి కనపడని నీరు తలుపులను తోసుకుని ఇళ్లలోకి వచ్చి చేరడంలో ఆశ్చర్యమేముంది. వర్షం కురిస్తే భూమి శుభ్రవౌతుంది. స్వచ్ఛమైన నీరు, ఓషధులతోను, ఆరోగ్యవర్ధకమైన ధాతువులతోను మరింత స్వచ్ఛమైన నీరు వాగుల ద్వారా వంకల ద్వారా చెరువులను నింపుతుంది, నదీ జలాలు అద్దాలవలె అలరారుతాయి, పచ్చటి పొలాలలోకి స్వచ్ఛమైన మట్టివాసనలు పాలకంకులు పరిమళాలతో జతకట్టి మాధుర్య పవనాలను సభలను తీర్చుతాయి. ఆపఃపునన్తు పృధివీమ్-నీరు భూమిని శుభ్రం చేయుగాక-అన్న వేద ఋషుల ఆకాంక్ష, తరతరాల భారతీయుల ఆకాంక్ష! కానీ ఇదంతా క్రమంగా మారిపోయింది. నీరు స్వయంగా కలుషితం అయిపోతున్నది. కలుషితమైన నీరు భూమిని ఎలా శుభ్రం చేయగలదు...? అందువల్లనే భాగ్యనగరం నడిబొడ్డున ముచికుంద నది-మూసీ-నరకంలోని వైతరిణి వలె కాలుష్యపు పొగలు కక్కుతూ ప్రవహిస్తోంది! అనంతగిరి అడవులనుంచి ఔషధీయ ధాతువులను కలుపుకుని ఒకప్పుడు ప్రవహించిన మచుకుంద నేడు కాలుష్యపు విష రసాయనాలతో కోరలు చాచుతోంది! కేంద్రీకరణ దీనికి ప్రధాన కారణం. హుస్సేన్‌సాగర్, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ వంటి జలాశయాలు నిండి పొంగులెత్తితే వరద నీరు ప్రవహించే మార్గాలన్నీ నేడు కబ్జాలకు గురి అయి ఉన్నాయి. అక్రమంగా నిర్మించిన ఇళ్లతో నిండి ఉన్నాయి... మహానగరమంతా అక్రమంగా నిర్మించిన కట్టడాల వల్లనే నీరు ముందుకు పోలేక లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి చొరబడింది! అక్రమ నిర్మాణాలు దశాబ్దుల అవినీతికి సజీవ సాక్ష్యాలు...
అనుమతి లేకుండా నిర్మించడంవల్ల నగరాలు పట్టణాలు నిలువునా పెరిగిపోతున్నాయి. దీనివల్ల జనం, వాహనాలు, వౌలిక సదుపాయాలు, ప్రగతి, కాలుష్యం ఒకేచోట కేంద్రీకృతవౌతున్నాయి. ఒక అంతస్తుగా నిర్మాణమై ఉన్న నాలుగైదు ఇళ్లు ఉన్న స్థలంలో వాటిని కూలకొట్టి ఆ స్థలంలో నలబయి ఇళ్లను అంతస్థులుగా నిర్మించేశారు. ఇదీ కేంద్రీకరణ. అనుమతిని ఇవ్వడం ద్వారా స్థానిక ప్రభుత్వాలు పని కట్టుకుని ఏళ్ల తరబడి ఈ కేంద్రీకరణను వ్యవస్థీకరించాయి. రెండు అంతస్థులు నిర్మించడానికి అనుమతి తీసుకున్నవారు నాలుగంతస్థులను నిర్మిస్తున్నారు. నాలుగు అంతస్థుల నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నవారు ఆరు అంతస్థులను నిర్మించేశారు. చెరువులను కుంటలను పూడ్చిపారేసి, నీరు ప్రవహించడానికి వెళ్లవలసిన మార్గాలను మూసేసి ఆయా స్థలాలలో అంతస్థులను అమర్చారు. అంతో ఇంతో తీసుకుని అక్రమ నిర్మాణ నిపుణులతో లాలూచీ పడుతున్న అధికారులు, అధికార రాజకీయ వేత్తలు దేశమంతటా కాలుష్యాన్ని కేంద్రీకరించారు...ఉత్తరఖండ్‌లో రెండేళ్ల క్రితం సంభవించిన జల విలయానికి, బురద ముంచెత్తి భూస్థాపితం చేయడానికి అక్రమ నిర్మాణాలు కారణం! జనసమ్మర్థాన్ని తగ్గించడం కోసం మళ్లీ శివారు పట్టణ వాటికలు..అక్కడ కూడ అంతస్థుల భవనాలే!! అందువల్ల పది వాహనాలు తిరిగిన చోట ఒకే చోట వందల వాహనాలు అయ్యాయి. ఇలా పదిరెట్లు ఒకేసారి పెరగడంతో రహదారులు పగిలిపోతున్నాయి. రోడ్డు మధ్యలో పెద్ద గుంతలు పడిపోవడం రోడ్డు పాతాళానికి కుంగిపోవడం వంటి వాన వైపరీత్యాలకు కారణం ఈ వాహనాల కేంద్రీకరణ..అంతస్థుల భవనాలను నిర్మించే పద్ధతికి ఇకనైనా స్వస్తి చెప్పినట్టయితే, నగరాలు ఒకటి రెండు అంతస్థుల ఇళ్లతో అడ్డంగా విస్తరించినట్టయితే, వర్షపు బురద వరదలు ఇళ్లలోకి చొరబడడం తగ్గిపోతుంది...రోడ్డు కుంగిపోవడం, వంతెనలు కూలిపోవడం, పాత ఇండ్లు పడిపోవడం ఆగిపోతుంది..
రాజధాని నగరాలను చిన్నవిగా తీర్చిదిద్దడం పరిపాలనకు సంబంధం లేని వాణిజ్య పట్టణాలు, పారిశ్రామిక వాటికలు, విద్యా కేంద్రాలు, సాంస్కృతిక ప్రాంగణాలు, క్రీడా శిక్షణ కేంద్రాలు దూరదూరంగా వికేంద్రీకృతం అవుతాయి! రాజధాని కేవలం పాలనా కేంద్రంగా ఉండాలి, ఐటి హబ్బుగాను, సినిమా క్లబ్బుగాను కేంద్రీకృతం కానక్కరలేదు...కేంద్రీకరణ కాలుష్యానికి ప్రధానమైన ప్రేరకం...కాలుష్యం వల్లనే వర్షపు నీరు మాత్రమే భూగర్భ జలం కూడ పంకిలమైపోతోం ది...కేంద్రీకరణ ప్రగతి వల్ల కాలుష్యం కేంద్రీకృతం అవుతోంది. స్వచ్ఛ్భారత పునరుద్ధరణ వికేంద్రీకృత ప్రగతి వల్ల మాత్రమే సాధ్యం! ప్రజా వికేంద్రీకరణ జరగాలి...