కరీంనగర్

ప్రియుడితో పెళ్లి జరిపించాలంటూ ప్రియురాలి బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్కతుర్తి, సెప్టెంబర్ 22: పెళ్లి చేసుకుంటానని పెద్దమనుషుల ముందు ఒ ప్పుకుని ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని, ప్రియుడితో పెళ్లి జరిపించాలని డిమాండ్‌చేస్తూ ప్రియుడి ఇంటి ముం దు ప్రియురాలు బైఠాయించిన సంఘటన ఎల్కతుర్తి మండలం దామెర గ్రా మంలో గురువారం సాయంత్రం చో టుచేసుకుంది. ఈ సంఘటనకు సం బంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దామెర గ్రామానికి చెందిన ఐత స్వర్ణలతకు, ఎల్కతుర్తికి చెందిన గడ్డం రాకేష్ తో గత ఏప్రిల్‌లో వివాహం జరిగింది. అయితే, పెళ్లికి ముందే వివాహేతర సంబంధం ఉన్న ప్రవీణ్‌తో స్వర్ణలత అక్రమ సంబంధం పెట్టుకొని రాకేష్ అత్త,మామలకు దొరికిపోయింది. ఈ సంఘటనపై ఇరు కుటుంబసభ్యులు పంచాయితీ నిర్వహించి రాకేష్‌తో వి డాకులిస్తేనే ప్రవీణ్‌తో పెళ్లి జరిపిద్దామని పత్రాలు రాసుకున్నారు. రాకేష్‌కు విడాకులిచ్చిన కూడా ప్రవీణ్ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి కనబడకపోవడం తో ఆగ్రహం చెందిన స్వర్ణలత ప్రవీణ్ ఇంటి ముందు మహిళా సంఘాలతో కలిసి బైఠాయించగా, హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక పోలీస్ అధికారి స్వర్ణలతను తీసుకెళ్లడంతో గ్రామస్థులు, మహిళా సంఘాల సభ్యులు ఆ గ్రహానికి గురయ్యారు. దామెరకు చేరుకున్న హుజూరాబాద్ రూరల్ సిఐ గౌ స్‌బాబా, ఎస్‌ఐలతోసహా పోలీస్ సిబ్బ ందిని గ్రామపంచాయతీ కార్యాలయం లో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న హుజూరాబాద్ డిఎస్పీ ఎం.రవీందర్‌రెడ్డి, హుస్నాబాద్ సిఐ దాసరి భూ మయ్యలు చేరుకుని స్వర్ణలతకు న్యా యం చేస్తామని హామీ ఇవ్వడంతో ని ర్బంధించిన పోలీస్ సిబ్బందిని వదిలిపెట్టారు. ఈ విషయంపై మనస్థాపానికి గురైన స్వర్ణలత తండ్రి సంపత్ పురుగుల మందు సేవించగా, వెంటనే కుటుంబ సభ్యులు వరంగల్ ఆసుపత్రికి తరలించారు.