గుంటూరు

నల్లమడ ఆధునికీకరణకు రూ. 240 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, సెప్టెంబర్ 23: నల్లమడ వాగు ఆధునికీకరణ పనులకు అవసరమైన 240 కోట్ల రూపాయల నిధులు త్వరలో మంజూరు చేయిస్తానని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రత్తిపాడు ఎండిఒ కార్యాలయంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు వరద ముంపునకు గురైన పంటల నష్టం అంచనాపై నియోజకవర్గ స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ భారీవర్షాల వల్ల ప్రతి ఏడాది నల్లమడ ముంపుతో వేలాది ఎకరాలు నష్టపోవాల్సి వస్తుందని, వాగు ఆధునికీకరణకు 240 కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంత ప్రజలు, రైతులను ఆదుకుంటామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 5 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు ముంపునకు గురైనట్లు అధికారులు అంచనా వేశారని, రెండు రోజుల తర్వాత మరోసారి పక్కా అంచనా రూపొందిస్తారన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.