గుంటూరు

వరదల్లో కొట్టుకుపోయిన రైల్వేలైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, సెప్టెంబర్ 23: వరద బీభత్సంతో రైల్వేశాఖకు అపార నష్టం వాటిల్లింది. సత్తెనపల్లి-పిడుగురాళ్ళ మధ్య పలుచోట్ల రైల్వేట్రాక్ కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనితో గుంటూరు-సికింద్రాబాద్, గుంటూరు- మాచర్ల మధ్య నడిచే అన్ని రైళ్ళను రద్దుచేశారు. ఈ మార్గంలో దూళ్లిపాళ్ళ, రెడ్డిగూడెం, అనుపాలెం గ్రామల సమీపాన సుమారు 3 కిలోమీటర్లవరకు రైల్వేలైన్ కొట్టుకుపోయింది. శుక్రవారం రైల్వే అధికారులు సంఘటనా ప్రదేశానికి చేరుకొని యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. కనీసం వారం రోజుల వ్యవధిలో రాకపోకలకు లైన్ క్లియర్ ఇవ్వవచ్చునని చెబుతున్నారు. రాత్రింబవళ్లూ వందలాది మంది కూలీలను, సుమారు 40 జెసిబిలను అక్కడ వినియోగిస్తున్నారు. చుట్టుపక్కలవున్న కూలీలతోపాటు పరిసర గ్రామల వారిని కూడా ఈ పనుల్లో వినియోగించుకుంటున్నారు. గత 40 ఏళ్ళ చెరిత్రలో ఇటువంటి పరిస్థితి రైల్వేకి రాలేదని భావిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన రైల్వే ఇంజనీర్లు ఇక్కడువుండి పనులను వేగవంతంగా జరిగేలా చూస్తున్నారు. ఈ ట్రాక్ నిర్మాణం జరిగితే తప్ప ఈ మార్గంలో రైళ్లు నడిచే అవకాశం ఉండదు.