తెలంగాణ

ప్రభుత్వానికి ప్రతిపక్షాల బాసట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ప్రకృతి కనె్నర్ర చేయడంతో ప్రజలను ఆదుకునేందుకు ప్రతిపక్షాలన్నీ నడుం బిగించాయి. సహాయక కార్యక్రమాల్లో ముందుండాలని పార్టీ అగ్ర నాయకులు తమ పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వర్షం, వరద బాధితులను ఆదుకునేందుకు సహాయక కార్యక్రమాల్లో ముందుండాలని తెలుగు దేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం వారు జిల్లా పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు బాధితులను ఆదుకోవడానికి అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, టిఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగు యువత నాయకులు బృందాలుగా ఏర్పడి సహాయక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్‌కు ఎన్ని సార్లు బాధితులు మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. బాధితులను ఆదుకునేందుకు టి.టిడిపి కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో హెల్ఫ్ లైన్ సెంటర్ ఫోన్ నెంబర్ల (040-30269985, 30269983)ను ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు.
ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపు
వర్షం, వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ నాయకులకు, ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వరద ప్రాంతాలను సందర్శించాలని, ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఆదుకోవాలని సూచించారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన కోరారు. ఇలాఉండగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పర్యటించిన మహ్మద్ షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు.
ప్రభుత్వంతో కలిసి ముందడుగు..
బాధితులను ఆదుకునే విషయంలో, వారికి తాగు నీరు, భోజన వసతి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందడుగు వేయాలని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2002లో తుపాను, వరదలు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు ముందుండి సహాయ కార్యక్రమాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో బిజెపి నగర నాయకుడు వెంకట రమణి అధ్యక్షతన జరిగిన నగర పార్టీ నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.