ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీకి వరద పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: వరదనీరు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తడంతో మొత్తం 70 గేట్లను 3 అడుగులమేర పైకి లేపి లక్షా 35వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఐదేళ్ల తర్వాత మొత్తం గేట్లను పైకెత్తడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం. పులిచింతల నుంచి లక్షా 70వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతున్నది. కీసర నుంచి 13వేల క్యూసెక్కుల నీరు, అలాగే పట్టిసీమ మోటార్లు కట్టివేసినప్పటికీ ముందుగా వదిలిన నీటి వలన 3,500 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతోంది. కాల్వలన్నింటికి కలిపి 7వేల క్యూసెక్కుల నీటిని వదులుతూ మిగిలిన నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
ఇదిలా వుండగా జలవనరులశాఖ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులతో కలిసి ప్రకాశం బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల రాష్ట్రం మొత్తంపై 18.7 శాతం అధికంగా ఈనెలలో వర్షపాతం నమోదైందన్నారు. ఈనెల 23వ తేదీ వరకు 109 మిమీ వర్షపాతం నమోదు కావల్సి వుండగా 130 మిమీ నమోదైందన్నారు. గుంటూరు, ప్రకాశం, తూ.గో. జిల్లాల్లో గత నాలుగు రోజులుగా అధిక వర్షపాతం నమోదైందన్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 24 గంటల్లో 28.9 శాతం నమోదు కాగా దాచేపల్లి మండలంలో అత్యధికంగా 171 మిమీ నమోదైందన్నారు. పులిచింతలకు భారీగా వరదనీరు చేరుతున్నందున నల్గొండ జిల్లా గ్రామాలను ఆ రాష్ట్ర జలవనరుల మంత్రితో మాట్లాడి అప్రమత్తం చేసామన్నారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజీల మధ్య 5 నుంచి 10 టిఎంసిల నీటిని నిల్వ చేసే సామర్ధ్యంతో మరో ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టామన్నారు.

చిత్రం.. ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రం వైపు ఉరకలు వేస్తున్న కృష్ణమ్మ