ఆంధ్రప్రదేశ్‌

పులిచింతలకు వరద తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, సెప్టెంబర్ 23: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీటి తాకిడి అధికమైంది. గురువారం ప్రాజెక్టులో 29 టిఎంసిల నీటిని నిల్వ ఉంచిన ప్రాజెక్టు అధికారులు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా అధికారులతో ప్రాజెక్టు వద్ద జరిపిన సంప్రదింపుల అనంతరం శుక్రవారం 30 టిఎంసిల నీటిని నిల్వ ఉంచారు. ఎగువ నుంచి 1,05,476 క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుండగా, 12 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత 30 టిఎంసిల నీటిని నిల్వ చేయడం ఇదే ప్రథమం కావడంతో కృష్ణ, నల్గొండ, గుంటూరు జిల్లాల నుంచి సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. గురువారం కృష్ణానదిలో ప్రవహించిన వరద నీటి ఉద్ధృతికి గల్లంతైన చల్లగరిగ గ్రామానికి చెందిన వృద్ధుడు జానునాయక్ ఆచూకీ శనివారం కూడా తెలియరాలేదు. ఆయన బంధువులు, గజ ఈతగాళ్లు, జాలర్ల సాయంతో కృష్ణానదిలో గాలింపు చర్యలు సాగిస్తున్నారు.

చిత్రం.. పులిచింతల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ