తెలంగాణ

10కోట్ల నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వర్షాల వల్ల దెబ్బతిన్న జాతీయ, రాష్ట్ర రహదారులు, వంతెనలు, కాజ్‌వేలకు మరమ్మతులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు వర్షాలవల్ల రహదారులు దెబ్బతిని సుమారు పదికోట్ల రూపాయల వరకు నష్టం కలిగినట్టు చెప్పారు. ఇది ప్రాథమిక అంచనా అని, నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు, రంగారెడ్డి జిల్లాలో కాగ్నా నది, నిజామాబాద్ జిల్లాలోని బిచ్చుకంద వద్ద కౌలాస్ నాటా దాటికి, నల్లగొండ జిల్లాలోని మూసీ నది ప్రవాహానికి వాటి పరిధిలోని చాలా బ్రిడ్జిలపై వరద నీరు ప్రవహిస్తోంది. దాం తో అక్కడ ఎలాంటి పనులు చేపట్టేందుకు సాధ్యం కావడం లేదని ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు.

చిత్రం.. వరంగల్ జిల్లా వందఫీట్ల రోడ్డులో తులసీబార్ దగ్గర వరద ఉద్ధృతి ఉండటంతో తాళ్ల సహాయంతో ప్రజలను ఒడ్డుకు చేరుస్తున్న పోలీసులు