తెలంగాణ

ఈ వర్షాలు శుభసూచకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ సంగారెడ్డి, సెప్టెంబర్ 23:తన అనుభవంలో ఇంత భారీ వర్షాలు ఎన్నడూ చూడలేదని, ఈ వర్షాలు భవిషత్తుకు శుభసూచకంగా తాను భావిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే అయినా సంయమనంతో ఉండాలని ప్రజలకు సూచించారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లో నీరు సమృద్ధిగా చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు శుక్రవారం మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల వద్దకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తున్నాయన్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. అన్ని సూపరింటెండింగ్ కార్యాలయాల్లోనూ కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాలువ గట్లు, చెరువు గట్లు తెగితే పూడ్చేందుకు ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలన్నారు. నిరాశ్రయులైన ప్రజలను గుర్తించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి భోజన వసతి, ఇతర సౌకర్యాలు సమకూర్చాలని సిఎం ఆదేశించారని చెప్పారు. ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కృష్ణానదిపై కర్నాటకలో నిర్మించిన ఆల్మట్టి నిండుకోవడంతో దిగువకు నీటిని వదులుతున్నారని, మరోవైపు బీనా నది నుంచి కూడా వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులోకి 80 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని చెప్పారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకునే అవకాశం మెండుగా కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిత్రం.. సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు