విజయనగరం

దండయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్),సెప్టెంబర్ 24: దోమల నియంత్రణను ప్రజలు సామాజిక బాధ్యతగా గుర్తించి భాగస్వాములు కావాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రిమృణాళిని చెప్పారు. శనివారం ఆనందగజపతి ఆడిటోరియంలో విజయనగరం ఎమ్మెల్యే మీసాలగీత అధ్యక్షతన జరిగిన దోమలపై దండయాత్ర- పరిసరాల పరిశుభ్రత పై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచినపుడే ఆరోగ్య సమాజాన్ని నిర్మించగల మని చెప్పారు. ప్రతి ఒక్కరు దోమల నియంత్రణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు. వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వ్యిక్తిగత పరిశుభ్రత పాటిస్తే సగం వ్యాధులు దరి చేరవని అన్నారు. ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానాకి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలు బహిరంగా మలవిసర్జన చేయకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. దోమలు వ్యాప్తి చెందకుండా తమ వంతు కృషిచేయాలని,కలుషిత ఆహారం, కలుషిత నీరు సేవించరాదని కలెక్టర్ సూచించారు. పోలియో, ప్లేగు వ్యాధులు ఏవిధంగా దేశంనుండి నిర్మూలించామో అదే రీతిలో అందరు కలిసి దోమలు నియంత్రణకు సహకరించాలని కోరారు. అనంతరం దోమల నియంత్రణ పై ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీ గాదెశ్రీనివాసుల నాయుడు, జెసి శ్రీకేష్ లఠ్కర్, ఎజెసి నాగేశ్వరరావు, డిపి ఓ సత్యనారాయణరాజు, జిల్లా ఖజానా అధికారి గీత, డిసి హెచ్ ఎస్ ఉషారాణి, ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

వ్యాధులను నియంత్రించాలి

గజపతినగరం, సెప్టెంబర్ 24: రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి దోమలు వలన వచ్చే జ్వరాలపై ప్రత్యేక దృష్టిసారించి జ్వరాలు తీవ్రత తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ బి.వి. విజయలక్ష్మి అన్నారు. శనివారం గజపతినగరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని పరిశీలించడానికి వచ్చిన ఆమె వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దోమలపై యుద్ధం ప్రత్యేక కార్యక్రమానికి జిల్లాకు ప్రత్యేక అధికారిగా తమను ప్రభుత్వం నియమించిందని చెప్పారు. అందులో భాగంగానే జిల్లాలోని సిహెచ్‌సిలు, పిహెచ్‌సిలు పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇంతవరకు 32డెంగ్యూ కేసులు నమోదు కాగా మరణాలు సంభవించలేదని అన్నారు. అలాగే 1927 మలేరియా కేసులు నమోదు కాగా అందులో గిరిజన ప్రాంతంలోనే 1779కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. మలేరియా కేసుల నిర్ధార్ణ అయిన రోగి వివరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రికార్డులలో నమోదు చేసి జిల్లా మలేరియా అధికారికి జరుగుతుంది కానీ సిహెచ్‌సిలల్లో నమోదు కావడంలేదని అన్నారు. అందుకే జిల్లాలో గల సిహెచ్‌సిలు ఏరియా ఆసుపత్రులకు ఎం-2పుస్తకాలు సరఫరా చేయాలని డిసిహెచ్‌కు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. గ్రామాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసామని అన్నారు. కార్యక్రమంలో రీజనల్ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ బి. భారతి రెడ్డి, ఆత్మాలజిస్టు రామచంద్ర, ఆసుపత్రి సూపరింటిండెంట్ పి. అరుణాదేవి తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 24: సమాజంలో రోజురోజుకి పెరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి పోలీసు యంత్రాంగానికి సహకరించాలని విశాఖ రేంజ్ డి ఐజి సిహెచ్ శ్రీకాంత్ కోరారు. శనివారం జిల్లాలోని భోగాపురం మండలం మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉత్తరాంధ్రా జిల్లాల పోలీసు ఉన్నతాధికారు, అధికారులకు సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్ మాట్లాడు ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందుతోందని అయతే అదే సమయంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ సేవలు మానవ జీవనంలో ఒక భాగంగా మారడాన్ని ప్రస్తావిస్తూ ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరాలకు కొంతమంది పాల్పడుతున్నారని చెప్పారు. ఇటువంటి నేరాలపట్ల అవగాహన, అప్రమత్తత ఎంతో ముఖ్యమని తెలిపారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు పోలీసు యంత్రాంగానికి అవసరమైన అవగాహన కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సైబర్ నేరస్తులను గుర్తించేందుకు ఆధునిక పద్దతులను ఉపయోగించడంలో నిపుణులు సలహాలు, సూచనలు వినియోగించుకోవాలని చెప్పారు. ప్రజామాధ్యమాల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా ఎస్పీ లేళ్ల కాళిదాసు రంగారావు మాట్లాడుతు సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసు అధికారులు, సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సదస్సులో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, విజయనగరం ఓ ఎస్ డి అప్పలనాయుడు, పార్వతీపురం ఎ ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఎఎస్పీ ఎ.వి.రమణ, మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజీ సి ఇ ఓ లోకం ప్రసాదరావు, ఇ ఎస్ ఎఫ్ నిపుణుడు అనీల్, డిఎస్పీలు, మూడు జిల్లాల సిఐలు పాల్గొన్నారు.
సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలు
విజయనగరం(టౌన్),సెప్టెంబర్ 24: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా విజయనగరం ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రిమృణాళిని తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విజయనగర ఉత్సవ నిర్వహణపై పలు సూచనలు ఈసందర్భంగా సభ్యులు చేసారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయనగర ఉత్సవాలు, పైడితల్లి సిరిమాను ఉత్సవాలు ఒకే సమయంలో జరుగుతున్నందున పట్టణాన్ని విద్యుత్తు దీపకాంతులతో అలంకరించాలని చెప్పారు. చారిత్రక భవనాలు, ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. జిల్లాతో అనుబంధం గల ప్రజలను ఈవేడుకలకు ఆహ్వానించాలని సూచించారు. జిల్లాలో ప్రావీణ్యం సంతరించుకున్న కళాకారులను ఈవేడుకల్లో ప్రోత్సహించాలని ఆదేశించారు. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేడుకలు ఉండాలని అన్నారు. విద్యార్ధులు, యువత, మహిళలు అన్ని వర్గాల వారికి అనువైన వ్యాసరచన, చిత్రలేఖనం, వంటలు, ముగ్గులు, తెలుగు అమ్మాయి వంటి పోటీలు ఈసందర్భంగా నిర్వహించాలని చెప్పారు. జిల్లా కుచెందిన ప్రముఖులకు సత్కారాలుచేయాలని సూచించారు. ఉత్సవాలులో జిల్లా చరిత్ర అందరికి తెలిసేలా కార్యక్రమాలు ఉండాలని చెప్పారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని సూచించారు. కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర సాంస్కృతికశాఖ నుండి 30 లక్షలు, పర్యాటక శాఖ నుండి 10 లక్షల నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు అయోధ్య మైదానం, ఆనందగజపతి ఆడిటోరియం , గురజాడ కళాభారతి, కోట, విజ్జీ స్టేడియం, సంగీత కళాశాలు వేదికలుగా ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈసమావేశంలో జడ్పీ చైర్మన్ శోభాస్వాతిరాణి, విజయనగరం ఎమ్మెల్యే మీసాలగీత, జెసి శ్రీకేష్‌లఠ్కర్, ఎజెసి నాగేశ్వరారావుఅధికారులు సభ్యులు పాల్గొన్నారు.
ఃసంఆకట్టుకున్న
ఆకాశవాణి సంగీత సమ్మేళనం
విజయనగరం(పూల్‌బాగ్), సెప్టెంబర్ 24: కర్ణాటక హిందుస్తానీ సంగీతంలో నిష్ణాతులైన వారిని పరిచయం చేసేందుకు ఆకాశవాణి సంగీత సమ్మేళనం ద్వారా పరిచయం చేస్తున్నామని విశాఖ ఆకాశవాణి ప్రోగ్రాం అసిస్టెంట్ సత్యనారాయణమూర్తి అన్నారు.పట్టణంలోని ఆనందగజపతి కళాక్షేత్రంలో శనివారం రాత్రి ఆకాశవాణి సంగీత సమ్మేళనం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు 1954 సంవత్సరం నుండి సంగీత సమ్మేళనం కార్యక్రమాలను ఆకాశవాణి ప్రసారం చేస్తోందని చెప్పారు. కళలకు కాణాచి అయిన విజయనగరంలో సంగీత సమ్మేళనం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ప్రసంగానంతరం సి ఎస్ అనురూప్ వయోలిన్ కచేరీ జరిగింది. ఆనందభైరవి రాగంలో కమలాంబ కీర్తనతో కచేరీని ప్రారంభించి వరుసగా పావనగురు, అనుపమగుణాంబుది, శ్రీవల్లీ దేవసేనాపతి ,్భజమానస వంటి కీర్తనలను వయోలిన్‌పై హృద్యంగా పలికించారు.కె ఎం ఎస్‌మణి మృదంగంపై, శైజు మోర్సింగ్‌పై సహకారమందించారు.వయోలిన్ కచేరీ అనంతరం బి వి జయశ్రీ జరిగింది. వయొలిన్‌పై పుదుక్కోటై అంబికాప్రసాద్, మృదంగంపై శ్రీనివాసన్ ,మోర్సింగ్‌పై రఘు సహకారమందించారు. అధిక సంఖ్యలో సంగీతాభిమానులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణకు
రాజకీయ పక్షాలు సహకరించాలి
విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 24: ఎస్సీ వర్గీకరణకు రాజకీయ పక్షాలు సహకరించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు మంద కృష్ణ మాదిగ కోరారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో ఎస్సీ వర్గీకరణ సాధనకోసం అనుసరించాల్సిన కార్యాచరణపై జిల్లా ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతు వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని కోరారు. వర్గీకరణకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు వర్గీకరణకు అనుకూలంగా సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఎస్సీ వర్గీకరణ సాధనకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్మ యుద్ధం పేరిట నవంబర్ 20న హైదరాబాద్‌లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎం ఆర్‌పి ఎస్ జిల్లా ఇన్‌చార్జ్ రామయ్య, పెంకి సుధాకర్, సురగాల లక్ష్మణరావు పాల్గొన్నారు.