మహబూబ్‌నగర్

భారీ వర్షం..్భరీ నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 26: జిల్లాలో గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత ఏడాది వర్షాలు లేక కరువులో కొరల్లో చిక్కుకున్న రైతులకు ఈ ఏడాది వర్షాలు సంవృద్దిగా కురిశాయి. ఆశించిన మేర వర్షాలు కురిసినా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురియడంతో రైతులు కుదేలైయ్యారు. వర్షాలు కురిసిన ఆనందం మరవకముందే నష్టాలు తమదరి చేరడంతో రైతులు లాబోదిబోమంటున్నారు. భారీగా సాగుచేసిన మొక్కజోన్న, జోన్న, కంది, పత్తి, ఆముదం, పెసర, మినుము పంటలు రైతులకు నిరాశే మిగిలింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావం జిల్లా తీవ్రంగా చూపింది. దింతో గత పదిపదిహేను రోజుల నుండి ముసురుతో కూడిన ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో రైతులకు ఓ పక్క ఆనందం ఉన్న మరోపక్క పంటనష్టం అంచనా వేసుకుంటే దిమ్మతిరిగేలా ఉంది. జిల్లాలో దాదాపు 3లక్షల హెక్టార్లలో మొక్కజోన్న పంటను సాగుచేశారు. అయితే ఆగస్టు మాసంలో వర్షాలు సరిగ్గా లేని కారణంగా 50వేల హెక్టార్లలో పంటలు ఎండిపోయాయి. ప్రస్తుతం నిరంతరంగా వర్షం కురుస్తుండడంతో మరో 50వేల హెకార్ట పంట దెబ్బతింది. ఇది ఇలా ఉండగా జిల్లాలో 2.50లక్షల హెక్టార్లలో పత్తిని సాగుచేశారు. ప్రస్తుతం వరణుడి ప్రతాపం జిల్లాపై పడడంతో పత్తిరైతుకు ఆశించిన మేర దిగుబడి వచ్చే పరిస్థితి లేకుండా పొయింది. వర్షాలకు పొలాల్లో నీరు చేరడంతో పత్తి చెను ఎర్రబారడం, కాయ పగిలిన పత్తి వర్షానికి తడిసి రైతు ఆశల్లో నీరు చల్లింది. పచ్చ, తెల్ల జోన్న పంటల పరిస్థితి ఆయోమయంలో పండింది. భారీ వర్షాలు, ముసురుతో కూడిన వర్షానికి జొన్నకంకి నల్లబారింది. దింతో చేతికి వచ్చిన జోన్న ముసురు వర్షానికి పొలాల్లోనే మొలకెత్తి రైతులను తీవ్రంగా కృంగదీసింది. జిల్లాలో పలు చెరువులు, కుంటలు నిండి ఆలుగులు పారుతుండడంతో చెరువుల కింద సాగుచేసిన వర్షాదార పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో దాదాపు 25 చెరువులకు గండ్లు పడడంతో వాటి కింద సాగుచేసిన పంటలు నీటమునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా అధికారుల అంచనాల ప్రకారంగా కేవలం వర్షానికి దాదాపు 25హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదిక అందించారు. అయితే రబీ సిజన్‌కు మాత్రం ఎలాంటి డోకా లేకుండా పంటల సాగుకు పుష్కలంగా నీరు రావడంతో సంతోషం ఉన్న ప్రస్తుతం సాగు చేసిన ఖరీఫ్ పంటకు మాత్రం అతి భారీ వర్షంతో భారీ నష్టం వాటిల్లింది. జిల్లాలో కంది, మొక్కజోన్న, జోన్న, పత్తి, పెసర, రాగి పంటలకు దెబ్బతినడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు.