తెలంగాణ

15మండలాలతో ఆసిఫాబాద్ జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: కొత్తగా తెరపైకి వచ్చిన ఆసిఫాబాద్ జిల్లాలను 15 మండలాలతో ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని సోమవారం ముఖ్యమంత్రితో జరిగిన సమాలోచనలో విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లాల కూర్పుపై వారితో చర్చించారు. ఆదిలాబాద్ జిల్లాను 20 మండలాలతో, మంచిర్యాల జిల్లాను 13 మండలాలతో, ఆసిఫాబాద్ జిల్లాను 15 మండలాలతో, నిర్మల్ జిల్లాను 18 మండలాలతో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 16 మండలాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.