బిజినెస్
2017 డిసెంబర్‌కల్లా కెటిపిఎస్ 7వ దశ పూర్తవ్వాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పాల్వంచ, అక్టోబర్ 4: ఖమ్మం జిల్లా పాల్వంచలో నూతనంగా నిర్మిస్తున్న కెటిపిఎస్ 7వ దశ కర్మాగార నిర్మాణ పనులను టిఎస్ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కర్మాగారంలో టిజిడెక్, కూలింగ్ టవర్ ఇఎస్పి చినీ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. అనంతరం కెటిపిఎస్ ఓఅండ్ఎమ్ కర్మాగారంలోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 7వ దశ నిర్మాణ పనులను నిర్దేశించిన 2017 డిసెంబర్‌కల్లా పూర్తిచేసేలా చూడాలని, అందుకు అధికారులు బిహెచ్ఇల్ కంపెనీ ప్రతినిధులు, కార్మికులు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా తాత్కాలిక రహదారులను ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేయాలని కోరారు. 2017 ఏప్రిల్ నెలలో కర్మాగారంలో లైటప్ చేసే విధంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జెన్కో డైరెక్టర్ ప్రాజెక్ట్ సి రాధాకృష్ణ, సివిల్ సిఇ అజయ్, కెటిపిఎస్ చీఫ్ ఇంజనీర్లు మంగేష్‌కుమార్ రత్నాకర్ తదితరున్నారు.
సమీక్షా సమావేశంలో జెన్కో ప్రతినిధులు