రాష్ట్రీయం

క్రమబద్ధీకరణకు మళ్లీ అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: అర్బన్ సీలింగ్ ల్యాండ్ ఆక్రమితులకు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తూ రెవిన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె ప్రదీప్ చంద్ర పేర్కొన్నారు. అలాగే గతంలో ప్రభుత్వ ఆక్రమిత భూముల క్రమబద్దీకరణ కోసం జారీ చేసిన జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న వారు డబ్బులు చెల్లించడానికి కూడా అవకాశం కల్పిస్తూ మరో ఉత్తర్వును రెవిన్యూ శాఖ జారీ చేసింది. ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు పూర్తి డబ్బు చెల్లించకపోవడం వల్ల వారికి రిజిస్ట్రేషన్లను నిలిపి వేసింది. అయితే తిరిగి దరఖాస్తుదారుల నుంచి డబ్బులు తీసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేయడానికి అవకాశం కల్పించి ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.