రాష్ట్రీయం

ఉద్ధృతంగా నైరుతి రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: నైరుతీ రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్ధృతంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది.
ఈ ప్రభావం వల్ల గత 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని, వచ్చే 24 గంటల్లో కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం ప్రకటించింది. ఒడిషాతో పాటు సమీప రాష్ట్రాలైన తెలంగాణ తదితర రాష్ట్రాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల తుపాను ద్రోణి ఏర్పడి ఉందని ఐఎండి శాస్తవ్రేత్త చరణ్‌సింగ్ తెలిపారు. దీని ప్రభావం తెలంగాణలో బలంగా ఉంటుందని వెల్లడించారు. గత 24 గంటల్లో రామగుండంలో 13 సెంటీటర్లు, కరీంనగర్ జిల్లా మల్యాల, సుల్తానాబాద్, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదైంది.

చిత్రం.. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లో జలమయమైన రోడ్డు