తెలంగాణ

సరస్వతి రూపంలో భద్రకాళీమాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ (కల్చరల్), అక్టోబర్ 8: వరంగల్ నగరంలోని ప్రముఖ దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవాలయ క్షేత్రంలో దేవీశరన్నవరాత్రోత్సవాలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఉదయం 4 గంటలకు చతుస్థానార్చన, ఉషఃకాల పూజ లు చే సారు. అనంతరం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తక రూపిణీ అయిన సరస్వతి అమ్మవారిని దర్శించుటకు భక్తులు వేలాదిగా ఆలయానికి చేరుకొని అక్షరాభాస్య పూజలు జరుపుకున్నారు. శాక్తద్వైత దశమహావిద్యలోని శ్రీవిద్యా ఉపాసన పద్దతిలో అమ్మవారికి కాళరాత్రి దుర్గార్చన నిర్వహించి భద్రపీఠ సేవను చేసారు. సాయంత్రం రక్తబీజహాదుర్గార్చన చేసి అశ్వవాహనంపై ఊరేగించారు. అనంతరం మహాపూజా, కుమారి సువాసినీ పూజలు నీరాజన మంత్రపుష్పాది క్రతువులను జరిపారు.