ఆంధ్రప్రదేశ్‌

12వేల కోట్లు ‘గల్లంతు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 17:అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడులకు సర్కారీ ప్రకటనలే గీటురాళ్లు! మరి అవే తప్పుల తడకలుగా ఉంటే..పరస్పరం పొంతన లేని గణాంకాలతో విస్మయం కలిగిస్తే పరిస్థితి ఏమిటి? ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని చాటిచెప్పేందుకు జరుగుతున్న పోటాపోటీ ప్రకటనల్లో పొంతన కొరవడింది. ఫలితంగా వేలాది కోట్లే ‘గల్లంతు’అయ్యాయి. లక్షలాదిగా ఉపాధి లక్ష్యాల్లోనే తేడాలొచ్చేశాయి. కేవలం మూడు వారాల వ్యవధిలో జారీ అయిన మూడు పత్రికా ప్రకటనల చోద్యమింది. వీటిని కమిషనర్ పేరుతో సమాచార, పౌర సంబంధాల విభాగమే జారీ చేసింది. సాధించబోయే అభివృద్ధి లక్ష్యాల మాట ఎలా ఉన్నా..వచ్చిన పెట్టుబడులకు సంబంధించి కూడా రెండు పత్రికా ప్రకటనల్లో ఏకంగా 12వేల 490 కోట్ల రూపాయల మేర తేడా ఉండటం గందరగోళానికి దారితీస్తోంది. సెప్టెంబర్ 26న జారీ చేసిన ప్రకటనలో రాష్ట్రంలోకి 59వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు మొదలయ్యాయని తెలిపారు. కొన్నింటిలో ఉత్పత్తులు మొదలయ్యాయని, మరికొన్నింటిని ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నారనీ తెలిపారు. అంతే వరకూ బాగానే ఉంది..గందరగోళమంతా ఈ నెల 16న జారీ అయిన మరో ప్రకటన వల్లే తలెత్తింది. ఇందులో పదాలేవీ మారలేదు కానీ, పెట్టుబడుల పరిమాణమే మారిపోయింది. మొత్తం 47,680కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. అందులో కూడా..వచ్చిన పెట్టుబడులు 43,660 కోట్లుగా పేర్కొన్నారు. రాబోయే పెట్టుబడులు 2,850గా వివరించారు. ఈ రెండింటినీ కలిపితే అయ్యే మొత్తం 46,510కోట్లు మాత్రమే. అంటే మొదటి ప్రకటనకు, రెండో ప్రకటనకు మధ్య ఉన్న తేడా ఏకంగా 12వేల 490కోట్ల రూపాయలు. పెట్టుబడుల మొత్తంలో తేడాలున్నా సమాచార ప్రజా సంబంధాల విభాగం పట్టించుకోలేదు. అందుకు సంబంధించి ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో..ఎన్ని రాబోతున్నాయో కూడా వెల్లడించలేదు. ముఖ్యమంత్రికి చెందిన కోర్‌డాష్‌బోర్డు నుంచే తమకు సమాచారం అందుతుందని ఐఅండ్‌పిఆర్ కమిషనర్ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. పత్రికా ప్రకటనలను పర్యవేక్షించే జాయింట్ డైరెక్టర్ రిటైర్ అయ్యారని, ఇక నుంచి ఇలాంటి తప్పుల్లేకుండా చూసుకుంటానని తెలిపారు. ఈ నెల 16న జారీ అయితే ప్రెస్‌నోట్‌లో తప్పిదం వల్ల రాష్ట్రం మరో లక్ష కోట్ల రూపాయల మేర పెట్టుబడుల్ని నష్టపోయింది! గత నెల్లో జారీ చేసిన ప్రకటనలో మూడు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులతో పరిశ్రమలు మొదలు అవుతాయని పేర్కొన్న విషయం గమనార్హం. ఈ తేడాపైనా ఎలాంటి వివరణ లేదు. ఇక 2015-20 సంవత్సరానికి సంబంధించి 3,10,000 కోట్ల మేర పెట్టుబడుల్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మరో ప్రకటనలో తెలిపారు. అంతే కాదు, 28,25,000 ఉద్యోగాలనూ కల్పిస్తామన్నారు. ఒక్క పారిశ్రామిక రంగంలోనే రెండు లక్షల కోట్ల పెట్టుబడులతో 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని అందులో తెలిపారు. అంతే కాదు, ఏఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో కూడా వివరించారు. వీటన్నింటినీ కలిపినా మొత్తం ఉద్యోగాలు 20లక్షల 70వేలే. అంటే..ఏడు లక్షల 55వేల ఉద్యోగాలు ‘గల్లంత్త’న్నమాట!