కృష్ణ

రోబోటిక్స్, డ్రోన్స్, ఫిన్ టెక్నాలజీతో ఎపి ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: మోనటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (సింగపూర్ సెంట్రల్ బ్యాంక్, ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అధారిటీ), ఆంధ్రప్రదేశ్ మధ్య శనివారం కుదిరిన ఎంవోయు చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సమాచార పౌర సంబంధాలు, మైనారిటీ సంక్షేమం, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాధరెడ్డి తెలిపారు. ఆయన శనివారం బందరు రోడ్డులోని గేట్‌వే హోటల్‌లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ని ఆర్థికంగా, టెక్నాలజీపరంగా, సాంఘికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. రానున్న కాలంలో డిజిటల్ టెక్నాలజీదే హవా అని చెప్పారు. భవిష్యత్ అంతా ఫిన్‌టెక్ టెక్నాలజీ యుగమని చెప్పారు. ఫిన్‌టెక్ టెక్నాలజీకి వైజాగ్‌ని కేంద్రంగా చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఫిన్ టెక్నాలజీలో సింగపూర్ కంపెనీలది అందెవేసిన చేయని, అలాంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌తో ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల ఫిన్‌టెక్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా వైజాగ్ అవతరించిందని తెలిపారు. సింగపూర్ కంపెనీలు మన రాష్ట్రంతో ఎంవోయు కుదుర్చుకోవడంలో ముఖ్య ఉద్దేశం సింగపూర్‌లో మ్యాన్ పవర్ తక్కువని, మన దేశంలో మ్యాన్ పవన్ చాలా ఎక్కువని తెలిపారు. అందుకే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 220 డిగ్రీ కాలేజీల నుంచి 2.4 లక్షలు, 230 పిజి కాలేజీల నుంచి 3.6 లక్షలు, మొత్తంగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఏటా బయటకు వస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఐటి అడ్వైజర్ జెఎ చౌదరి మాట్లాడుతూ బ్లాక్ చైన్ టెక్నాలజీ, అనలైటిక్ ఫైనాన్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీలే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం సింగపూర్ కంపెనీలతో ఎంవోయు కుదుర్చుకుందని తెలిపారు. ఇందులో ఫిన్‌టెక్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సింగపూర్ లాంటి దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవటం చాలా మంచి పరిణామం అని చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీల కంటే వ్యక్తులకు ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకోడానికి వచ్చిన సింగపూర్ ప్రతినిధి సోప్‌నందు మహంతి మాట్లాడుతూ రాష్ట్రంలో దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి ఉన్నారని, దానివల్ల రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు అనేక స్టార్టప్ కంపెనీలు వస్తాయని తెలిపారు. భారతి, యాక్సాలైవ్, ఐటి, ఇన్నోవేషన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి లతా అయ్యర్ మాట్లాడుతూ ఫిన్‌టెక్ టెక్నాలజీ వలన రాష్ట్ర ప్రభుత్వానికి, సింగపూర్ దేశానికి బహుముఖంగా లాభాలు ఉన్నాయని తెలిపారు.