ఆంధ్రప్రదేశ్‌

ప్రజా బ్యాలెట్‌లో టిడిపిపై వ్యతిరేకత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 23: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టిడిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, టిడిపి తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోందని ఎపి పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిసిసి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై నిర్వహిస్తున్న ప్రజా బ్యాలెట్ ద్వారా టిడిపి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో వెల్లడవుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌లో అన్ని వర్గాలకు చెందిన 17వేల మంది ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారని తెలిపారు. వీరిలో కేవలం 24 మంది మాత్రమే ప్రత్యేక హోదా అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారంటే, హోదా కావాలని తెలుగు ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక హోదా కోసం పిసిసి రాజీలేని పోరు చేస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టుపెట్టేశారని అన్నారు. గతంలో విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు పెట్టారని దాదాపు 4.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని ఊదరగొట్టారని అన్నారు. ఇప్పటికీ నవ్యాంధ్రలో ఒక్క పరిశ్రమ వచ్చిందని నిరూపించగలరా అని సవాలు విసిరారు. గత సదస్సులో ఒప్పందాలకు దిక్కులేదుగానీ, మళ్లీ వచ్చే ఏడాది భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామనడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. పరిశ్రమలు రాకపోతే యువతకు ఉపాధి అవకాశాలు మృగ్యమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు టిడిపి ఇచ్చిన హామీల అమలు విషయంలో కూడా ప్రజలు తమ తీవ్ర వ్యతిరేకతను వెల్లడించారన్నారు. టిడిపి ప్రభుత్వం తాజాగా చంద్రన్న దళితబాట పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందని, టిడిపి ప్రజా ప్రతినిధులు ఏ మొహం పెట్టుకుని దళితుల దగ్గరకు వెళ్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన మంత్రులంతా అవినీతికి పాల్పడుతున్నారని రఘువీరా రెడ్డి ఆరోపించారు. అంతకు ముందు రఘువీరారెడ్డి ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా యడ్ల ఆదిరాజు పేరును ప్రకటించారు.