కృష్ణ

శివారు ప్రాంతవాసులకూ మంచినీరిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 25: మంచినీటి సరఫరాలో అవలంభిస్తున్న రోజువారీ విధానం వల్ల శివారు ప్రాంత ప్రజలకు అందని పరిస్థితి ఏర్పడిందని మంగళవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత అజెండాలోని 22 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఇందులో ఒక అంశాన్ని తిరస్కరించారు. 33వ వార్డు కౌన్సిలర్ తమ్మన హేమకుసుమ ప్రతిపాదన మేరకు రామరాజు థియేటర్ వెనుక రోడ్డులోని 3వ బజారుకు తంగిరాలవారి వీధి అని నామకరణం చేయాలని అజెండాలో ప్రవేశపెట్టిన అంశాన్ని సభ్యులు తిరస్కరించారు. గతంలో ఈ వీధికి వెంకటనరసింహ వీధిగా నామకరణం జరిగిందని, ఈ పేరు తొలగించి మరో పేరు పెట్టడం సబబుకాదని అధికార, ప్రతిపక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని తిరస్కరించాలని ఛైర్మన్‌ను కోరారు. అజెండాపై చర్చ అనంతరం నిర్వహించిన జీరో అవర్‌లో మంచినీటి సమస్యపై సభ్యులు గళమెత్తారు. ప్రతిపక్షంతో పాటు అధికార పక్ష సభ్యులు కూడా మంచినీటి సమస్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ ఛైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం మాట్లాడుతూ శివారు ప్రాంతమైన చిలకలపూడి ప్రాంతానికి రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండకపోవడం వల్ల ఆప్రాంత ప్రజలు తీవ్ర మంచినీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు సభ్యులు కూడా ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి ఇబ్బందులను ఛైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మంచినీటి సమస్యపై ప్రత్యేకంగా అధికారులు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. సరఫరాలో జరుగుతున్న లోటుపాట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష సభ్యులు అచ్చాబా, మేకల సుబ్బన్న మాట్లాడుతూ బందరు నుండి నీటిని తీసుకెళుతున్న పెడన మున్సిపాలిటీ అధికారులు అక్కడి ప్రజలకు ప్రతిరోజూ మంచినీరు అందిస్తున్నారని, మనం మాత్రం సక్రమంగా సరఫరా చేయలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన టిడిపి కౌన్సిలర్ నారగాని ఆంజనేయప్రసాద్ మాట్లాడుతూ పెడన మున్సిపాలిటీకి రామరాజుపాలెం ఛానల్ కింద నీరు వస్తుందని, మన మున్సిపాలిటీకి బందరు కెనాల్ ద్వారా వస్తుందని, ఈ వ్యత్యాసాన్ని ప్రతిపక్షం గుర్తించాలన్నారు. ఛైర్మన్ బాబాప్రసాద్ మాట్లాడుతూ మంచినీటి సమస్యపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఇప్పటికే పట్టణంలోని పలు ప్రాంతాలలో రిజర్వాయర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. పైప్‌లైన్ల లీకేజీపై కూడా దృష్టి పెట్టామన్నారు. పట్టణంలోని వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో కమిషనర్ జస్వంతరావు, కౌన్సిలర్లు బత్తిన దాసు, మోదుమూడి శేషుబాబు, బచ్చుల అనిల్, లంకా సూరిబాబు, శీలం బాబ్జి, అస్గర్, గూడవల్లి నాగరాజు, ధనికొండ నాగమల్లేశ్వరి, బందెల కవిత పాల్గొన్నారు.