ఆంధ్రప్రదేశ్‌

డెంగ్యూ తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 29: పరిశుభ్రతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. ‘పరిసరాల పరిశుభ్రత - దోమలపై దండయాత్ర’ కార్యక్రమంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు వారాలుగా చేసిన కార్యక్రమాలపై అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. డెంగ్యూ కేసులు నెలన్నర రోజుల్లోనే 1,317 నుంచి 122 వరకు తగ్గడం ప్రభుత్వ కార్యక్రమాల ఫలితమేనన్నారు. రాష్టస్థ్రాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికార యంత్రాంగం, సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. దోమలపై దండయాత్రలో 48వేల పాఠశాలల్లోని 40 లక్షల మంది విద్యార్థులు, 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడం పట్ల సంతృప్తి ప్రకటించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 3.5 లక్షల దోమతెరలు పంపిణీ చేసినట్లుగా తెలిపారు. దోమల బెడద నియంత్రించాం, అంటువ్యాధులను నిరోధించాం. సమష్టి కృషివల్లే మంచి ఫలితాలు రాబట్టామని, ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలన్నారు. తుపాను వాతావరణం నెలకొంది కాబట్టి అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దోమలు మళ్లీ ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ కేసులు వస్తున్నాయో గమనించి ఆ ప్రాంతానికి వెళ్లి వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. కేసులు తగ్గాయి కాబట్టి దోమల లార్వా ఉత్పత్తి కార్యక్రమాలపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. దోమల లార్వా ఉత్పత్తి నిరోధించేలా మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో రెండవ దశ నిధులు పెండింగ్‌లో ఉన్న అంశం ఆముదాలవలస శాసనసభ్యుడు కూన రవికుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే వాటిని విడుదల చేయాలని ఆదేశించారు.