ఆంధ్రప్రదేశ్‌

తీర భద్రత పెంపుపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 1: తీర ప్రాంత భద్రతపై నౌకదళం, కోస్ట్‌గార్డ్ అధికారులు మంగళవారం సమావేశమై చర్చలు జరిపారు. విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తీర ప్రాంత భద్రతపై చర్చించారు. తీర భద్రతపై కోస్ట్‌గార్డ్, నేవీ సంయుక్తంగా చేపట్టాల్సిన చర్యలపై క్షుణ్ణంగా చర్చించారు. భద్రత పటిష్టతకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కోస్ట్‌గార్డ్, ఇండియన్ నేవీ సమర్థను మరింత పెంపొందించుకునేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ స్ట్ఫా వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్, కోస్ట్‌గార్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజన్ బర్‌గోత్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోస్ట్‌గార్డ్, నేవీకి చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.