ఆంధ్రప్రదేశ్‌

పేదల సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 2: పట్టణ పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నందున అల్పాదాయ వర్గాలకు చెందిన ఒక్కో కుటుంబం ఏడాదికి కనీసం అదనంగా రూ.60 వేల ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు అమలుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 2019 నాటికి ప్రతి కుటుంబం ఆదాయాన్ని కనీసం రూ.లక్షకు పెంచాలని సూచించారు. రాష్ట్రంలో లక్షలోపు జనాభా కలిగిన అమృత్ పథకం కిందికి రాని 42 మున్సిపాల్టీల అభివృద్ధికి రూ.3700 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపేందుకు సిఎం అంగీకరించారు. స్మార్ట్ గవర్నెన్స్‌లో భాగంగా మున్సిపాల్టీల్లో అమర్చిన ఎల్‌ఇడి వీధిదీపాలను ఇకపై కమాండ్ కంట్రోలు రూం నుంచి మానిటరింగ్ చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని పట్టణాల్లో నివాసం వుంటున్న సుమారు 4 లక్షల అల్పాదాయ కుటుంబాలు ఏడాదికి మొత్తం రూ.2,400 కోట్ల ఆదాయం సమకూర్చుకునేలా సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పేద కుటుంబాలకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులు, స్ర్తినిధి, వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు, ఆర్థిక సాయం అందించాలని సూచించారు. పట్టణ పేదరిక నిర్మూలనకు ప్రధానంగా ఆదాయ మార్గాలను పెంచడం, పౌష్టికాహారం అందించడం, ఆరోగ్య - సామాజిక భద్రత కల్పించడం, అందరికీ విద్య అనేవి లక్ష్యాలు కావాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. 2019 నాటికి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పేదరికం శాతాన్ని గణనీయంగా తగ్గించాలని స్పష్టం చేశారు. ఎవరెవరికి ఏ రూపంలో సాయం చేస్తున్నాం, ఎంతవరకు వినియోగించుకుంటున్నారు, ఎంతమేర ఆదాయం సమకూర్చుకున్నారన్న వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సిందిగా సూచించారు. పట్టణాల్లో పేదలు వినియోగించుకుని స్వయం ఉపాధి పొందేలా 30 ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అలాగే 1,577 మంది సభ్యులతో మొత్తం 310 సేవలను అందించేందుకు 43 జీవనోపాధి కేంద్రాలు నెలకొల్పినట్టు చెప్పారు. అయితే ఉత్పత్తి కేంద్రాలతో పాటు మార్కెటింగ్ కేంద్రాలను అనుబంధంగా ఏర్పాటు చేయడం ద్వారా పేదలకు మరింత లాభం చేకూరుతుందని ముఖ్యమంత్రి సూచించారు. అల్పాదాయ వర్గాలకు చెందిన యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2015-16లో 35,896 మంది శిక్షణ పొందగా వీరిలో 29,672 మందికి ఉపాధి లభించింది. 2016-17లో 35,600 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు అధికారులు చెప్పారు. పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు సైతం కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులకు దీటుగా రాణించేందుకు, ఉత్తమ ప్రతిభ చాటేందుకు ఫౌండేషన్ కోర్సు ప్రవేశపెట్టామన్నారు.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు