మహబూబ్‌నగర్

ఎన్నికల హామీలను విస్మరించిన కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, నవంబర్2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను విస్మరించి పేదలను పట్టించుకోవడం లేదని సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి యం.డి జబ్బార్ అన్నారు. బుధవారం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విదానాల వల్ల రైతులు తమ వ్యవసాయ వృత్తిని వదులుకొని ఇతర ఆధాయ వనరుల కోసం పట్టణాలకు చేరుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రభుత్వం పేద, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆయన అన్నారు. మహాజన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రజలను చైతన్యం చేసి ఫ్రభుత్వంపై ఒత్తిడి తె చ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టె విధంగా చూస్తామని ఆయన అన్నారు. దళితులకు మూ డు ఎకరాల భూమి ఇస్తామన్న కెసిఆర్ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్ట్టీ చట్టం చేసి ఇప్పటి నిబందనలను రూపొందించలేదన్నారు. దళితులపై దాడులు, వివక్ష కొనసాగుతుందన్నారు. సామాజిక న్యాయం జరగ డం లేదని ఆయన ఆరోపించారు. గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, వక్ఫ్ భూములను తిరిగి ఇప్పిస్తామని చెప్పిన కెసిఆర్ ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ఆయ న ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు మూడవ విడుతను విడుదల చేయలేదని దీంతో రైతులు ప్రయివేట్ అప్పులకు వెళ్లి రుణాలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోకపోవడం వల్ల వ్యవసాయం చేయలేని దుస్థితిలో రైతులు ఉన్నారని, వ్యవసాయం చేయలేక కుల వృత్తి అయిన వ్యవసాయాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరికి అన్నం పెట్టె రైతన్నకే అన్నం తినే్న స్థోమత కరువవుతుందని దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ద తీసుకొని రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, ఉద్యోగ భర్తీ జరగకపోవడంతో నిరుద్యోగులు పెరిగిపోతున్నారని, నిరుద్యోగ భృతిని ప్ర భుత్వం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం ఆటకెక్కిందని, ఏగ్రా మంలో ఇళ్ల నిర్మాణం జరగడం లేదని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్ధిష్ట వ్యవధి ప్రణాళికలు లేవని, అవినీతి చోటు చేసుకుందని ఆ యన అన్నారు. సమాగ్రాభివృద్ధి జరిగినప్పుడే ముఖ్యమంత్రి అనుకుంటున్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను తెలుసుకొని చైతన్యం చేసేందు కు సిపిఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 17 నుండి వచ్చే ఏడాది మార్చి 12వ తేది వరకు మహాజన పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వనపర్తి జిల్లాలో 6, 7,8 తేదిల్లో నిర్వహిస్తున్నామని పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధ్దికి కృషి
వెల్దండ, నవంబర్ 2: గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి శాయశక్తుల కృషి చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి తెలిపారు. చారకొండ మండలం గోకారం గ్రామంలో 2 లక్షల 50 వేల రూపాయాలతో చేపట్టే రోడ్డు మరమ్మత్తు పనులకు ఎమ్మెల్యే బుధవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వౌళిక సదుపాయాలు కల్పిస్తూ గ్రామాల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను ప్రాదాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో రోడ్లు, వీదిలైటు, అంతర్గత రహాదారులు, తాగునీటి సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లక్ష్మమ్మ, డిసిసి అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌రెడ్డి,కాంగ్రెస్ నాయకులు పెద్దయ్యయాదవ్, బాలస్వామి,బాస్కర్‌రెడ్డి, పర్వత్‌రెడ్డి,బక్కయ్యగౌడ్, శేఖర్,వీరాచారి,కొండల్, శ్రీనివాస్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

అబివృద్ధిలో అగ్రగామిగా జడ్చర్ల
* మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోకెల్ల జడ్చర్ల నియోజకవర్గాన్ని అబివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.బుధవారం మండల పరిధిలోని పెద్ద ఆదిరాల గ్రామంలో పలు అబివృద్ధి పనులకు మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జడ్చర్ల అన్ని రంగాలల్లో అబివృద్ధి చెందుతుందని తెలిపారు.విధ్యా,వైధ్య,ఆరోగ్య,ఉద్యోగ,ఉపాధి రంగాలల్లో జడ్చర్ల ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవ గంలో అనేక అబివృద్ధి కార్యక్రమాలను యుద్దప్రాతిపదికన నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా చూడటమే తాన భాధ్యత అని, అందుకోసం అవిశ్రాంతంగా కృషి చేస్తానని అన్నారు. ఒకప్పుడు మారుమూల గ్రామాలకు రవాణా సదుపాయాలు సక్రమంగా లేక పోవడం వల్ల అబివృద్ధిలో వెనుకబడి పోయాయని,తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే నియోజకర్గంలోని గ్రామగ్రామానికి బిటి రోడ్డు సౌకర్యం కల్పించానని అందువల్ల గ్రామాలు త్వరితగతిన అబివృద్ధి చెందుతున్నాయని అన్నారు. మంత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన మిని వాటర్ ట్యాంక్‌ను ప్రా రంభించారు. అదేవిధంగా పిహెచ్‌సి ఎర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. సేవాలాల్ మహారాజ్ ఆలయంలో రేకుల షేడ్ నిర్మాణం కోసం ఎసిడిపి ద్వారా రూ.5లక్షలతో షేడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

పేట జిల్లా కోసం మండల సభ బహిష్కరణ
నారాయణపేటటౌన్, నవంబర్ 2: నారాయణపేట జిల్లా కోసం మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని మండలంలోని ప్రజాప్రతినిధులు బహిష్కరించారు. తమ రాజీనామాలను రాజీనామా ఫార్మాట్‌లో చేస్తామని వా టిని ఆమోదించాలంటూ ఎంపిటిసిల సంఘం, సర్పంచ్‌ల సంఘాల అధ్యక్షులు చెర్ల గు ండప్ప, నాగిరెడ్డిలు ఎంపిడిఓను కోరారు. బుధవారం ఉదయం మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభమైన వెంటనే జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్‌గౌస్ మాట్లాడుతూ మండలంలోని అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించి ఈ ప్రాంత అభివృది ధ్దకి తమవంతు సహకారం అందించాలని సూచించారు. కొల్లంపల్లి ఎంపిటిసి బస్వరాజ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అ యిన నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ విధానాలు సరికావని, అన్నీ అ ర్హతలు ఉన్న నారాయణపేటను జిల్లాగా ఏ ర్పాటు చేయాలని ఇందుకు సంబందించి మండల సభ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిద్దామన్నారు. జిల్లా ఏర్పాటయ్యే వరకు మండల సభను జరగనిచ్చే ప్రసక్తే లేదన్నారు. టిఆర్‌ఎస్ ఎంపిటిసి వేపూరు రాములు మాట్లాడుతూ అధికారపార్టీకి చెందిన తాము సైతం తమ ఎంపిటిసి పదవులకు రాజీనామా లు చేశామని, జిల్లా ఏర్పాటు కోసం తమకంటే ముందుగానే ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారని జిల్లా ఏర్పాటు ఉద్యమంలో పాల్గొంటున్న అందరికీ తాము మద్దతు తెలియజేస్తూ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్నామన్నారు.
పిఎసిఎస్ అధ్యక్షుడు సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు అనేది ప్రజాప్రతినిధుల ఆకాంక్ష కాదని, ప్ర జలు, యువకులు, విద్యార్థుల ఆకాంక్ష అని వా రి సహకారం లేనిదే మనం ప్రజాప్రతినిధులం కాలేమని, జిల్లా ఏర్పాటు కోసం తమ పదవులకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యే, ఎంపిటిసిలను ప్రతి ఒక్కరు అభినందించాల్సిందేనన్నా రు. అయితే ఉద్యమాన్ని ఎమ్మెల్యే ముందుండి నడిపించి జిల్లాను సాధించుకుందామని అప్పుడు ఎమ్మెల్యేతో పాటు రాజీనామాలు చేసిన ప్రతి ఒక్కరి పేర్లు నారాయణపేట జిలా లలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.
జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్‌గౌస్ మాట్లాడుతూ అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ తాము అధికారపార్టీకి చెందినా ప్రజల ఆకాంక్ష మెరకు మండల సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎంపిపి మణెమ్మ మాట్లాడుతూ మండల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి మండల సమావేశ మందిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్లకార్డులు పట్టుకుని పాదయాత్రగా వెళ్లి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి అంబేద్కర్‌కు వినతిపత్రం సమర్పించారు.

రైతులను మోసం చేస్తున్న కెసిఆర్
మక్తల్, నవంబర్ 2: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తన మాటల గారడితో రైతులను మోసం చేయడం తప్పా వారిని ఏనాడు ఆధుకున్న పాపాన పోలేదని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి తల్లోజి ఆచారి ఎద్దేవ చేశారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కొండయ్య ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై మహాధర్న కార్యక్రంలో భాగంగా స్థానిక తహశీల్దార్ కా ర్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి టి.అచారీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కొండయ్యలు మాట్లాడారు. ఇన్‌పుట్ సబ్సిడి రుణమాఫిలో కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని తెలిపా రు. ఎన్నికల ముందు రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫి చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, పేదలకు డబుల్ బెడ్‌రూములు కట్టిస్తామని తెగ డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల్లో గెలిచాక రైతుల రుణమాఫీ విషయం దేవుడెరుగుకానీ ఉన్న కొద్ది పాటి వ్యవసాయాన్ని వదిలి చెప్పులు అరిగే విదంగా బ్యాంకుల చుట్టు తిప్పుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సొమ్మొకరిది, సోకొకరిది అన్న విదంగా సొమ్ము కేంద్రానిది, సోకు కెసిఆర్ ప్రభుత్వానిది అన్న విదంగా పరిపాలన కొనసాగుతుందని అన్నారు. వర్షాభావ పరిస్థిల కారణంగా రైతులను ఆధుకోవాలన్న తలంపుతో తమ ప్రధానమంత్రి నరేంద్రమోది రూ.790 కోట్లను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చి వాటికి మరో రూ.300 కోట్లు కలిపి దాదాపు రూ.11వేల కోట్లను రైతులకు చెల్లించమని ఇచ్చారని అన్నారు. కాగా కెసిఆర్ కేంద్రం ఇచ్చిన డబ్బులను రాష్ట్ర ఖాతాలో జమచేసుకొని రైతులను తీవ్ర మోసం చేసిందని వారు మండి పడ్డారు. ముఖ్యమంత్రి చం ద్రశేఖర్‌రావుపేదలకు డబుల్ బెడ్‌రూము ఇళ్లు రావు, అల్లుడు హరీష్‌రావుమాపొలాలకు నీళ్లు రావు, కొడుకు తారకరామారావు మాకు ఉద్యోగాలు రావు, కూతురు కవితరావు మాకు బతుకమ్మ పండుగ నిధులు రావు, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మా గ్రామపంచాయతీకలు నిధులు రావు ఇలా వారి పేర్లల్లోనే రావురావు అ ని వుంటే ఎక్కడి నుండి వస్తాయని వారు ఎద్దేవ చేశారు. వారి నుండి రావు అన్న పదాన్ని తిరగరాస్తూ కమలం జెండ చేతపట్టి ఇలాంటి ఉధ్యమాలు, ధర్నాలు చేస్తే ప్రజల బాధలు తీరిస్తే అన్ని మనముంగిటకు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో వెంటనే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులనన్నింటిని పూర్తిచేసి రైతులకు సాగు, తాగు నీటిని అందించాలని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్రమోది వెంటనే రూ.13వేల కోట్లను విడుదల చేయడం జరిగిందనిఅన్నారు. కానీ గడచిన రెండున్నర సంవత్సరాల కాలంలో ఒక్క కాలువను నిర్మించకుండా ఉన్న కాలువలలోని గడ్డిని తొలగించి కాలువలకు నీటి వదలడం తప్పా ఏరైతు చెలకైనా తడిచిందా అంటూ వారు కెసిఆర్‌ను ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న పనులు గాలికొదలి మంత్రి హరీష్‌రావు ఆగమేగాలమీద వచ్చి లిప్టులను ప్రారంభించి పోతే ఆనీరు కాలువల ద్వారా మళ్లీ నదిలోకి వె ళ్లడం తప్పా రె తుల పొలాలకు వెళ్లడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుండి రూ. 29లు చెల్లించి సన్న బియ్యాన్ని కొలుగోలు చేసి పంపుతున్న నరేంద్రమోది రాష్ట్ర ప్రభుత్వం వాటా ద్వారా రూ.2, ప్రజల నుండి ఒక్క రూపాయను తీసుకొని ఇస్తుంటే మొత్తం తానే ఇస్తున్నట్లు ఈప్రభుత్వం చెప్పుక రావడం ఇంత కన్న సిగ్గుచేటు లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనులు కలసి తెలంగాణను సాధించుకున్నప్పటికి ఉద్యమం చేసిన వానిని వదలి ఉద్దెర వాళ్లకు పదవు కట్టబెట్టం ఎంత వరకు సమంజసమని మండి పడ్డారు. డబుల్ బెడ్ రూములకై కేంద్రం రూ. 91వేల కోట్లు చెల్లిస్తే ఈపేద ప్రజలకు ఒక్క ఇల్లయినా కట్టిచ్చాడా అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలు తన ఖాతాలో బ్యాంకుల్లో జమ చేసుకొన్న కెసిఆర్ దగాకోరు, జూటాకోరు, అబద్దాలకోరు కాదాఅని అన్నారు. గత 6నెలల నుండి ఉపాధి పథకంలో పనిచేసే కూలీలకు కూలి డ బ్బులులేవు, గ్రామపంచాయతి సిబ్బందికి వేతనాలు లేవు, హోంగార్డుల పర్మనెంట్ లేదు ఇ దేనా కెసిఆర్ గారడి ప్రభుత్వమని వారు మండి పడ్డారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు భాగుపడలేదని, ఈవాళ్ల రైతులేడ్చిన నీప్రభుత్వం ఏనాడు భాగుడదని ఆయన అన్నారు.
నేడు మక్తల్ రైతులు కెసిఆర్‌కు కనువిప్పు కలిగించే కార్యక్రమం తీసుకోవడం ఎంతో అభినందించ వలసిన విషయమని ఆయన అన్నారు. అంతకు ముందు స్థానిక నల్లజానమ్మ దేవాలయం నుండి పట్టణ పురవీధులగుండా తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించా రు. బిజెపి నాయకులు భాస్కర్, సోమశేఖర్, కర్నిస్వామి, కుర్వ హన్మంతు, బాల్జేడ్ మల్లిఖార్జున్, విద్యాసాగర్, కోళ్ల వెంకటేష్ పాల్గొన్నారు.

కెఎల్‌ఐ కాల్వ పనులను పూర్తి చేయాలి
గోపాల్‌పేట, నవంబర్2: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించే డిస్టిబ్యూటరీ కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి అధికారులను ఆదేశించారు. బుధవారం గోపాల్‌పేట మండలానికి సాగునీరు అందించే డిస్టిబ్యూటరీ కాల్వను పనులను ఆమె పరిశీలించారు. రామిరెడ్డితండా దగ్గర ఉన్న కెఎల్‌ఐ డిస్టిబ్యూటరీ కాల్వ పనులను ఆమె పరిశీలిస్తూ అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులను పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాల్వ పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకొని వీలైనంత త్వరగా కాల్వ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కాల్వ దగ్గరకు వచ్చారని విషయం తెలుసుకున్న చాకల్‌పల్లి, గోపాల్‌పేట, పొల్కెపహాడ్, కేశంపేట గ్రామాల రైతులు అక్కడికి చేరుకున్నారు. రైతులు కాల్వలకు గండి కొట్టవద్దని అన్ని గ్రామాల చెరువులకు సాగునీరు వస్తుందని అన్నారు. కలెక్టర్ వెంట గోపాల్‌పేట తహశీల్ధార్ యేసయ్య, ఇరిగేషన్ డిఇ లోకిలాల్, అధికారులు, పలు గ్రామాల రైతులు, నాయకులు సత్యశీలారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

‘పేట’లో ఆగ్రహ జ్వాలలు
నారాయణపేటటౌన్, నవంబర్ 2: నారాయణపేట జిల్లా ఏర్పాటుపై ఎంపి జితేందర్‌రెడ్డి జిల్లాకేంద్రంలో చేసిన వాఖ్యలు నారాయణపేట డివిజన్ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఇకపై జిల్లాల ఏర్పాటు లేదని, అభివృద్ది పథంలో ముందుకు సాగాలని సూచించిన నేపథ్యంలో తమకు ఇచ్చిన మాటను తప్పుతారా అంటూ నారాయణపేట డివిజన్‌లో ఎంపి జితేందర్‌పై ప్రజలు, యువత, విద్యార్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంపి జితేందర్‌రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించి స్థానిక సత్యనారాయణ చౌరస్తాలో దగ్దం చేశారు. జిల్లా ఏర్పాటు కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలను చైతన్యవంతులను చేసేందు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన బైక్ ర్యాలీ నారాయణపేట నుండి దామర్‌గిద్ద మండలం, మద్దూరు, కొడంగల్ మీదుగా దౌల్తాబాద్‌కు చేరుకుంది. ఈ ర్యాలీని జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మనోహర్‌గౌడ్ ప్రారంబించగా పెద్ద సంఖ్యలో జిల్లా సాధన సమితి సభ్యులు, యువకులు పాల్గొన్నారు. కాగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపి జితేందర్‌రెడ్డి చేసిన ప్రకటన ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసి తీరాలని డిమాండ్ చేశారు. నారాయణపేట మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపిపి, ఎంపిటిసి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని జై నారాయణపేట జిల్లా అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్‌కు వినతిపత్రం సమర్పించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపిపి మణెమ్మ, పిఎసిఎస్ అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, ఆయా సంఘాల నాయకులు కాశీనాథ్, యాదగిరి, పళ్ల ర ఘు, గోపికృష్ణలు మాట్లాడుతూ నారాయణపేట జి ల్లా ఏర్పాటుకు సంబందించి సిఎం కెసిఆర్‌తో జిల్లా సాధన సమితి సభ్యులను కలిపి సమస్యను సానుకూలంగా పరిష్కరించి జిల్లా ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పిన ఎంపి జితేందర్‌రెడ్డి, మంత్రి లక్ష్మారెడ్డి తీరా చేతులెత్తేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ ఎంపిగా కెసిఆర్ గెలుపుకు కృషి చేసిన నారాయణపేట డివిజన్ ప్రజలు రెండు మార్లు పాలమూరు నుండి పోటీ చేసిన ఎంపి జితేందర్‌రెడ్డికి పట్టం క ట్టారని ఆ విషయాన్ని సిఎం కెసిఆర్‌తో పాటు ఎంపి విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాలమూరు ఎంపిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కెసిఆర్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించడం ఎంతవరకు సమంజసమన్నారు. కాగా తన స్వస్థలం ఆముదాలపాడు నడిగడ్డలో ఉన్న నేపథ్యంలో గద్వాల జిల్లాకు పట్టుబట్టిన ఎంపి జితేందర్ తనకు రాజకీయ యోగం కల్పించిన పాలమూరు జిల్లాలోని నారాయణపేట జిల్లా విషయంలో ఎందుకు సిఎంపై వత్తిడి తీసుకురాలేదని ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా ఏర్పాటయ్యే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉంటామని ఈ నెల 6నుండి తలపెట్టిన నిరవధిక బంద్ యథావిధిగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిటిసిలు, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మావోల బంద్‌కు సహకరించవద్దు
* కాగజ్‌నగర్ సిఐ రమేష్ బాబు
బెజ్జూరు, నవంబర్ 2: మావోయిస్టులు ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రజలు సహకరించవద్దని కాగజ్‌నగర్ రూరల్ సి ఐ రమేష్ బాబు అన్నారు. బుధవారం పెంచికల్‌పేట పోలీసు స్టేషన్‌లో మాజీ మావోయిస్టు సానుభూతిపరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు పోలీసులు సహకరిస్తారని తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏవోబి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోలు ఇచ్చిన బంద్‌ను విఫలం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రభాకర్, హెడ్‌కానిస్టేబుల్ నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రెసిడెన్షియల్ స్కూల్‌ను తనిఖీ చేసిన ఎంపి నగేష్
ఇచ్చోడ, నవంబర్ 2: మండల కేంద్రంలోని బాలురు గురుకుల పాఠశాలను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న భోజన సౌకర్యాలతో పాటు ఉపాధ్యాయుల పనితీరును ఆయన సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపట్ల ప్రత్యేక దృష్టిపెట్టినందునా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థుల భోజన వసతిలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు కూడా ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నతశిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ రేణుక కృష్ణకుమార్, టీఆర్‌ఎస్ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

22వరకు ట్యూషన్ ఫీజు గడవు పొడగింపు
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 2: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ట్యూషన్‌ఫీజు చెల్లించే గడవు ఈనెల 22 వరకు పొడిగించినట్లు ప్రాంతీయ సమన్వయ అధ్యయన కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇంత వరకు ఫీజు చెల్లించని వారు ఎదైని ఇంటర్నెట్ ద్వారా చెల్లించాలని సూచించారు. ఇతర వివరాలకు 08732221016 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
18 వరకు సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలి
వర్సిటీ పరిధిలో డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడవు ఉందని ప్రాంతీయ సమన్వయ అధ్యయన కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ బి. ఎల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 13నుంచి 16వరకు ఉంటాయన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి పేపర్‌కు రూ.100తో పరీక్ష ఫీజును ఏదేని ఇంటర్నెట్ కేంద్రం ద్వారా చెల్లించాలని సూచించారు.

వాహనాల విస్తృత తనిఖీలు
ఉట్నూరు, నవంబర్ 2: మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉట్నూరు పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు. బుధవారం స్థానిక తెలంగాణ చౌక్, ఎక్స్‌రోడ్, బిర్సాయిపేట్, శ్యాంపుర్ తదితర చౌరస్తాలలో వెళ్తున్న వాహనాలను నిలిపి తనిఖీ చేశారు. ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు చనిపోగా అవి బూటకపు ఎన్‌కౌంటర్లు అంటూ దానికి నిరసనగా ఈనెల 3వ తేదీన మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సైలు మంగిలాల్, సంతోష్ సింగ్‌లు తనిఖీలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బంద్ చేయాల్సిన అవసరం లేదని, సంఘవిద్రోహ శక్తుల మీదా ఓ కనె్నసి ఉంచాలని పిలుపునిచ్చారు. బంద్‌కు స్పందించవద్దని వ్యాపార, వాణిజ్య యజమానులకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు సైతం తమకు తెలియకుండా ఎక్కడికి వెళ్లకూడదని, తమకు సహకరించాలని అన్నారు. ఈ తనిఖీలో పోలీసులు ప్రతి ఒక్క సైకిల్ మోటార్‌ను మొదలుకొని భారీ వాహనాలను సైతం తనిఖీ చేశారు.

మావోల బంద్‌కు భారీ బందోబస్తు
* జిల్లా ఎస్పీ శ్రీనివాస్
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, నవంబర్ 2: ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఇచ్చిన రాష్ట్ర బంద్‌పిలుపు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తుతో పాటు నిఘా తీవ్రతరం చేసినట్లు ఎస్పీ మిట్ట శ్రీనివాస్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీతో రాష్ట్ర పోలీసు డిజిపి అనురాగ్ శర్మ సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా రాష్టవ్య్రాప్తంగా మావోల బంద్‌ను దృష్టిలో పెట్టుకొని జిల్లా పరిధిలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మారుమూల పోలీసు స్టేషన్‌ల భద్రతను కట్టుదిట్టం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దులలో నిరంతరం వాహనాల తనిఖీలను చేపట్టాలని, కార్టెన్ అండ్ సెర్స్, ఆపరేషన్‌లు కొనసాగించాలన్నారు. ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన పోలీసు స్టేషన్లలో సాయుధ బలగాలతో రక్షణ ఏర్పాట్లు చేశామని అన్నారు. జిల్లాలో ఐదు క్యూ ఆర్‌టీ (క్విక్ రియాక్షన్ టీం)లను ఏర్పాటు చేయడం జరిగిందని, వీరు అత్యవసర సమయంలో సిద్దంగా ఉంటారని అన్నారు. పోలీసు స్పెషల్ బ్రాంచ్ నిఘా విభాగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ సమాచార వ్యవస్థను పటిష్టపర్చుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో అసాంఘీక శక్తులు ప్రవేశించిన నిమిషాల్లోనే తెలిసేవిధంగా సమాచార వ్యవస్థ బలంగా ఉందని అన్నారు. ఇంద్రవెల్లి, గాదిగూడ, బోథ్, నార్నూర్, సిరికొండ, ఇచ్చోడ తదితర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్‌ల పరిధిలో సాయుధ బలగాలతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు అన్ని వేళల్లో విధుల్లో ఉంటారని, డిఎస్పీస్థాయి అధికారుల పర్యవేక్షణలో పెట్రోలింగ్ ఉంటుందని అనన్నారు. జిల్లాలో అసాంఘీక శక్తులు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం లేదని, ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, సిసిఎస్ డిఎస్పీ కె.నర్సింహారెడ్డి, కమ్యూనికేషన్ ఎస్సై ఎన్.సురేష్, కార్యాలయం అధికారులు జె.పుష్పరాజ్, ఆర్.్భరతి, సిసి పోతరాజు తదితరులు పాల్గొన్నారు.

మారుమూల గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలి
* ఇంచార్జి జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు
నార్నూర్, నవంబర్ 2: మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రుగైన వైద్యసేవలందించాలని ఇంచార్జి జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు అన్నారు. బుధవారం నార్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సంధర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ బాలింత గర్భిణీ స్ర్తిలకు ఎలాంటి అపాయం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇంటి వద్ద ప్రసవాలు కాకుండా ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాల్సిన బాధ్యత ఉందని డాక్టర్లను ఆదేశించారు. వైద్య సిబ్బంది ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ సేవాభావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా వ్యాధిపై పరీక్షలు నిర్వహించడంతో పాటు బ్లేడ్ షుగర్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రిలో మందులు, పడకల కొరత ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకవస్తే కలెక్టర్‌తో సంప్రదించి ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం చేస్తామని సిబ్బందికి భరోసా ఇచ్చారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా లేదా అని ఎస్‌పిహెచ్‌వో ఫల్వింద్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి వెంట అదనపు జిల్లా వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి అల్హాం రవి, ఎస్‌పిహెచ్‌వో ఫల్వింద్‌కుమార్, డాక్టర్లు శ్రీనివాస్, రాజునాయక్, సుమంత్, హెచ్ ఈవో వెంకటేశం, సూపర్‌వైజర్ మనోజ్ తదితరులు ఉన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి
* కుంరంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్
దహెగాం, నవంబర్ 2: ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. బుధవారం దహెగాం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. మండలంలో కనీస రోడ్డు సౌకర్యం లేని గ్రామాలున్నాయని ఎంపిడివో కుటుంబ రావును అడిగి తెలుసుకున్నారు. మండలంలోని లోహ గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యాలయంలోని సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. జూనియర్ అసిస్టెంట్ నవనీత్ కిషోర్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయినట్లు కలెక్టర్ దృష్టికి ఎంపిడివో తీసుకువచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు. మండలంలో రోడ్లు, కనీస సౌకర్యాలు లేని గ్రామాల నివేధికను అందించాలని ఎంపిడివోను ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తనిఖీ నిర్వహించారు. మండలంలోని ఎన్ని గ్రామాలు వేరే మండలాల్లో కలిసినట్లు ఎన్ని ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. నాలుగు గ్రామ పంచాయతీలు వివిధ మండలాల్లో విలీనం చేసినట్లు తెలిపారు. సాదాబైనామాలు, రిజర్వ్‌ఫారెస్ట్ ఏరియా, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాదాబైనామా కోసం 422 దరఖాస్తులు చేసుకోగా 100 దరఖాస్తులను పరిశీలించినట్లు ఆర్ ఐ వివరించారు. అలాగే సిబ్బంది ఖాళీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రికార్డులను పరిశీలించారు. మందులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పిహెచ్‌సిలో స్థానిక ఎంపిపి చిలువేరు కల్పన, స్థానిక సర్పంచ్ చిలువేరు జయప్రద చిన్నగుడిపేట గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా విలేకర్లతో తహసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ చంపాలాల్ మాట్లాడారు. రైతులు లాభదాయకమైన పంటలపై దృష్టిసారించాలని సూచించారు. వరి, పత్తి సోయా పంటలను సాగు చేయడమే కాకుండా పూల తోటలు, పండ్ల తోటలు, కూరగాయల పంటలను సాగు చేసి అధిక లాభాలు అర్జించాలని సూచించారు. అంతే కాకుండా నీటిని తక్కువగా ఉపయోగించి ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలన్నారు. రైతులకు పంట రుణాలతో పాటు వివిధ రుణాలను బ్యాంకు అధికారులు అందించాలని సూచించారు. ఈ నెల 4న ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీలో ఇంచార్జి ఎంఈవో నారాయణ, ఎంపిడివో కుటుంబ రావు, ఆర్ ఐ ఆత్రం చిన్ను, ఏఈలు భిక్షపతి, వినోద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమంపైనే ప్రత్యేక దృష్టి
* ఎమ్మెల్సీ సతీష్, ఎమ్మెల్యే దివాకర్ రావు
శ్రీరాంపూర్ రూరల్, నవంబర్ 2: ప్రజల సంక్షేమంపైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిలిపిందని ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. సిసిసి ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో టిడిపి నాయకులు టి ఆర్ ఎస్‌లో చేరిన సందర్బంగా వారినుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిడిపి నుంచి తెరాసలోకి చేరుతున్నారని తెలిపారు. పరిపాలన సౌలభ్యం, ప్రజల సంక్షేమం కోసమే జిల్లాల ఏర్పాటు చేయడం జరిగిందని, సీమాంద్ర ప్రభుత్వాల్లో అభివృద్ది కోసం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా కోసం రూ.3వేల కోట్లు రెండున్నర సంవత్సరాల్లోనే అభివృద్ది పనులకు కేటాయించిందన్నారు. జిల్లా ప్రజలకే కాకుండా సింగరేణి గని కార్మికుల సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి నిలిపారని కార్మికుల హక్కులు సాదిస్తామని, కార్మికులు ఎదురు చూస్తున్న వారసత్వ ఉద్యోగాలు అమలవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బేర సత్యనారాయణ, ఎంపిటిసి ఆశాలత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వంగ తిరుపతి, టిబిజికే ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, కోటిలింగం, టిఆర్‌ఎస్ నాయకులు తిప్పని రామయ్య, సుబ్బయ్య, గడ్డం తిరుపతి రెడ్డి, బండి తిరుపతి, దెబ్బటి అంజన్న, సర్పంచ్‌లు రాజేంద్రపాణి, ఐత శంకర్, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

గృహనిర్మాణ ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి
* జిల్లా కలెక్టర్ ఇలంబరితి
నిర్మల్, నవంబర్ 2: గృహనిర్మాణ పనుల కోసం వచ్చే ఆర్జీలను త్వరితగతిన పరిశీలించి వెంటనే మంజూరీ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇలంబరితి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ కమీషనర్లు, ఇంజనీర్లు, మెప్మా అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. పట్టణాల్లో ఆస్తిపన్ను సకాలంలో వసూలు అయ్యేలా చూడాలని, పారిశుద్య పనులు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టౌన్‌ప్లానింగ్, తాగునీటి సౌకర్యం తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ద కనబర్చాలని ఆయన అధికారులకు సూచించారు. అంతేకాకుండా గృహనిర్హాణాల కోసం వచ్చే దరఖాస్తులను వెంటనే పరిశీలించి మంజూరీ ఇవ్వాలన్నారు. పారిశుద్య పనులు సక్రమంగా ఉండాలని తెలిపారు. మెప్మా ద్వారా స్వశక్తి సంఘాలకు అధికమొత్తంలో రుణాలను అందించాలని ఆదేశించారు. నిర్మల్ మున్సిపల్ కమీషనర్ త్రయంబకేశ్వర్‌రావు మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్య నిర్వహణకు 177 మంది కార్మికులను నియమించినట్లు తెలిపారు. ఏడు ట్రాక్టర్ల ద్వారా పట్టణంలోని చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నట్లు తెలిపారు. కొన్ని ఆటోలను లీజుకు తీసుకుని పారిశుద్య పనులను చేపడుతున్నామని, 15 మంది లైసెన్సు సర్వేయర్ల ద్వారా గృహనిర్మాణాల పరిశీలన చేయిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో 1301 మహిళా స్వశక్తి సంఘాలు ఉన్నాయని, వారికి ఇప్పటి