కృష్ణ

2017 నాటికి చింతలపూడి లిఫ్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెడ్డిగూడెం, నవంబర్ 4: 2017వ సంవత్సరం నాటికి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఆ ప్రాంత రైతాంగానికి నిరంతరం సాగు నీరు అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. రెడ్డిగూడెం మండలంలోని అనే్నరావుపేట, మద్దులపర్వ, ముచ్చన్నపల్లి గ్రామాలల్లో జరిగిన జనచైతన్య యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ పూర్తి చేసినట్లు గానే చింతలపూడి లఫ్ట్ ఇరిగేషన్ పూర్తిచేస్తామన్నారు. చింతలపూడి లిప్ట్ ఇరిగేషన్‌కు ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. చింతలపూడి లిఫ్ట్ ద్వారా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. రైతులకు నిరంతరం సాగునీరు అందించి వారిని అదుకుంటామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 2018కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. జల వనరుల ద్వారా ఇప్పటి వరకు 18 వేల కోట్ల రూపాయలు నీరు-చెట్టు ద్వారా ఖర్చు చేసినట్లు తెలిపారు. మంత్రి ఉమాకు గ్రామాల్లో ప్రజలు పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు కె విజయబాబు, మండల పార్టీ అధ్యక్షుడు ముప్పిడి నాగేశ్వరరెడ్డి, ఎంపిపి తోటకూర నారయణరావు, డిసి చైర్మన్ కేసిబాబు తదితరులు పాల్గొన్నారు.